- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు ఓటర్ ఫాటిగ్.. జమిలి ఎన్నికలే సమాధానం: పీయూష్ గోయల్
దేశంలో ప్రతిసారీ జరిగే ఎన్నికల్లో ఓటేయడానికి ప్రజలకు విసుగెత్తిందని, దీనికి జమిలి ఎన్నికలే సమాధానమని పీయూష్ గోయల్ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: జమిలి ఎన్నికలపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు మాటి మాటికీ వచ్చే ఎన్నికలతో విసుగెత్తి పోయారని, అందుకే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సరైన నిర్ణయమని గోయల్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో నిర్వహించిన ఆంత్రప్రెన్యూర్స్ అండ్ ట్రేడర్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు ఎన్నికలు జరగడం వల్ల గవర్నెన్స్‌తోపాటు పలు కార్యక్రమాలకు సమస్యలు తలెత్తుతాయని గోయల్ చెప్పారు. ‘ప్రజలకు ఓటర్ ఫాటిగ్ (ఓటర్ల అలసట) వచ్చేస్తుంది. మాటి మాటికీ ఓట్లు వేయడానికి ప్రజలకు విసుగొస్తుంది’ అని అన్నారు. ఎన్నికల టైంలో వచ్చే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల పలు ప్రభుత్వ పనులు ఆగిపోతాయని వివరించారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం కూడా ఎక్కువగా ఉంటుందని గుర్తుచేశారు.






