- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Piyush Goyal: దేశానికి ప్రయోజనం ఉంటేనే ట్రేడ్ డీల్స్.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
దేశానికి ప్రయోజనం ఉంటేనే ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటామని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: దేశానికి ప్రయోజనం ఉంటేనే ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటామని, లేదంటే అగ్రిమెంట్స్ కుదుర్చుకోబోమని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) స్పష్టం చేశారు. మంచి ట్రేడ్ డీల్ (Trade deal) కుదిరితే దానిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. పరిశ్రమల సంఘం అసోచామ్ శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. దేశానికి అనుగుణంగా ఉంటేనే వాణిజ్య ఒప్పందాలు సాకారం అవుతాయన్నారు. దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
భారత్‌కు భారీ దేశీయ డిమాండ్ ఉందని, అనేక వస్తువులను దిగుమతి చేసుకోవడం మానేసి దేశంలోనే తయారు చేయొచ్చన్నారు. చిన్న, పెద్ద కంపెనీల మధ్య సమన్వయం అవసరం అని పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. యూపీఏ పాలనలో బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో ఉందని, దానిని పారదర్శక పద్ధతిలో పునర్నిర్మించామని నొక్కి చెప్పారు. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉందని తెలిపారు. కాగా, అమెరికాతో ట్రేడ్ డీల్ పై చర్చలు కొనసాగుతున్న వేళ పీయూష్ గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.






