- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air India Crash: ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ దర్యాప్తులో ప్రాతినిధ్యం కోరుతున్న పైలట్స్ అసోసియేషన్
విమాన ప్రమాదంపై దర్యాప్తులో భాగంగా తన సభ్యులను టీమ్‌లో చేర్చుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పైలట్ల గ్రూపు తెలిపింది

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవలి ఎయిర్ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తులో భాగం కావాలని 800 మందికి పైగా పైలట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఎల్‌పీఏ-ఇండియా) భావిస్తోంది. ఇందులో భాగంగా చట్టపరమైన సహాయాన్ని పరిశీలిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా విడుదలైన ఫ్లైట్ క్రాష్ ప్రాథమిక నివేదికలో పైలట్‌ల లోపం వల్ల ఈ దుర్ఘటన జరిగిందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుండటంతో 'పారదర్శకత లేకపోవడం' గురించి ఏఎల్‌పీఏ అధ్యక్షుడు ప్రశ్నించారు. ఇది పైలట్ల పట్ల పక్షపాతం వహించడమేనని ఏఎల్‌పీఏ ఇండియా ఆరోపించింది. దీనికోసం ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమాన ప్రమాదంపై దర్యాప్తులో భాగంగా తన సభ్యులను టీమ్‌లో చేర్చుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పైలట్ల గ్రూపు వెల్లడించింది. దీనికోసం ఏఎల్‌పీఏ-ఇండియా ప్రతినిధులు సోమవారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అధికారులను కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ఏఏఐబీ ప్రాథమిక నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచారు. దానిపై ఎవరి సంతకం లేదు. మాకు పారదర్శక్త కావాలి. దర్యాప్తు ప్యానెల్‌లో తమకు కూడా ప్రాతినిధ్యం ఇస్తే మంచిదని భావిస్తున్నామని ఏల్‌పీఏ-ఇండియా అధ్యక్షుడు శామ్ థామస్ పేర్కొన్నారు. తమ సభ్యులను దర్యాప్తు బృందంలో భాగం చేయడానికి అసోసియేషన్ చట్టపరమైన సహాయం గురించి ఆలోచిస్తోందని వెల్లడించారు.






