- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ తీసుకురావాలంటూ పిటిషన్!
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ తీసుకురావాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ విధానాన్ని తీసుకురావాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం విచారణకు అంగీకరించింది. అదే సమయంలో ఈ అంశంలో ఎంతో వ్యతిరేకత ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిటిషనర్లను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్జీ ధర్మస్థానం హెచ్చరించింది.
అయితే తాము ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వ్యతిరేకించడం లేదని, ఈ రిజర్వేషన్ల ఫలాలు అందాల్సిన వారికి అందాలని మాత్రమే కోరుకుంటున్నామని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఈ వెనుకబడిన వర్గాల్లో కొందరు రిజర్వేషన్ల ఫలాలు పొంది, ఆర్థికంగా ఎదిగినప్పటికీ.. ఆ తర్వాత కూడా రిజర్వేషన్ ఫలాలు అందుకుంటూనే ఉన్నారని ఈ పిటిషన్ పేర్కొంది.
అదే సమయంలో ఇదే వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన అట్టడుగు స్థాయి వారికి రిజర్వేషన్ల ఫలాలు అందడం లేదని తెలిపుతూ ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన పిటిషనర్లు.. సుప్రీంకోర్టులో ఈ వ్యాజ్యం వేశారు. ఈ సమస్య తీరేందుకు, అందరికీ సమానమైన, న్యాయమైన రిజర్వేషన్లు దక్కేందుకు విధానాలు తీసుకురావాలని వారు కోరారు.
రిజర్వేషన్లు పొందే వర్గాల్లో ఆర్థికంగా నిలదొక్కుకున్న వారే లబ్ది పొందడం వల్ల, అట్టడుగు స్థాయిలోని వారికి ఎదిగే అవకాశమే రావడం లేదని పిటిషనర్లు తెలిపారు. అందుకే ఈ రిజర్వేషన్లలో ఆర్థిక ప్రమాణాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.






