- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజస్థాన్ షాకింగ్ ఘటన..బంగారు గొలుసు దొంగిలించిన పావురం !
రాజస్థాన్ లోని ఓ ప్రముఖ జ్యువెలరీ షాప్ లో పావురం తన ముక్కుతో బంగారు గొలుసును ఎత్తుకెళ్లింది.

రాజస్థాన్ షాకింగ్ ఘటన..బంగారు గొలుసు దొంగిలించిన పావురం !
దిశ, వెబ్ డెస్క్: భూమిపైన అనేక రకాల సంఘటనలు జరుగుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాష్ట్రంలో ( Rajasthan ) అరుదైన సంఘటన చోటు చేసుకుంది. బంగారు గొలుసును (Rs 1 Lakh Gold Chain ) ఓ పావురం ( Pigeon) ఎత్తుకెళ్లిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అది కూడా ఓ జువెలరీ దుకాణం ( Rajasthan Jewellery Shop) నుంచి కావడం గమనార్హం. ఈ సంఘటన గురించి న్యూస్ బయటకు రాగానే అందరూ షాక్ అవుతున్నారు. పావురం ఏంటి ? బంగారు గొలుసు లాక్కొని ( Pigeon Steals) వెళ్లడం ఏంటని నివ్వరబోతున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
లక్ష రూపాయల బంగారు గొలుసు లాక్కెళ్లిన పావురం
రాజస్థాన్ లోని ఓ ప్రముఖ జ్యువెలరీ షాప్ లో పావురం తన ముక్కుతో బంగారు గొలుసును ఎత్తుకెళ్లింది. దీని విలువ దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటుందని సమాచారం అందుతోంది. సాధారణంగా ఏ ఇంట్లోకైనా పావురాలు రావడం చాలా కామన్. ఇళ్లల్లోకి వస్తే, వాటి పని అవి చేసుకుని వెళ్లిపోతూ ఉంటాయి. కానీ రాజస్థాన్ లోని ఓ బంగారం దుకాణంలోకి ఈ పావురం వచ్చి కొంప ముంచింది. ఆ దుకాణంలో ఉన్న వాళ్లంతా తమ పనిలో బిజీగా ఉండిపోయారు. ఇదే అదునుగా చేసుకున్న ఆ పావురం, తన ముక్కుతో లక్ష రూపాయల విలువైన బంగారు గొలుసును ఎత్తుకెళ్లింది. సెకండ్ల వ్యవధిలోని ఈ సంఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
తన ముక్కు ద్వారా చైన్ పట్టుకొని, గాల్లోకి ఎగిరిందట. ఆ తర్వాత ముక్కుతో తిరిగేయడంతో ఆ బంగారు గొలుసు పావురం మెడలో ఓ పూల దండ లాగా పడినట్లు కూడా చెబుతున్నారు. ఈ సంఘటన జరగగానే జువెలరీ షాప్ ఓనర్, సిబ్బంది అందరూ అలర్ట్ అయ్యారు. అక్కడే ఉన్న స్థానికులు కూడా ఆ పావురాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆ పావురం చుక్కలు చూపించినట్టు తెలుస్తోంది. చివరగా ఓ ఇంటిపై కప్పు మీద ఆ బంగారు గొలుసు పావురం మెడ నుంచి జారిపడినట్లు చెబుతున్నారు.
దీంతో ఆ గొలుసును యజమాని తీసుకొని, టెన్షన్ నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ న్యూస్ బయటకు రావడంతో నెటిజెన్స్ కూడా తెగ నవ్వుకుంటున్నారు. అంతేకాదు తమకు నచ్చిన కామెంట్స్ కూడా పెడుతున్నారు నెటిజెన్స్. బంగారం ధర ( Gold Rate) పెరిగిన నేపథ్యంలో పావురం కూడా కన్నేసిందని కొంత మంది కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా మన ఇండియాలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తులం బంగాంర ధర రూ.1.55 లక్షలపైనే ఉంది. మరో నెల రోజుల్లో రూ.2 లక్షలకు తులం బంగారం చేరుకునే ఛాన్స్ ఉందట.






