- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యుద్ధం ఎఫెక్ట్.. ప్రజల నెత్తిమీద మరో పిడుగు.. భారీగా పెరగనున్న ఔషధ ధరలు!
ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. మార్చి చివరి నాటికి మందుల ధరలు 10-20% పెరిగే అవకాశం కనిపిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్- ఇరాన్ (Iran Israel War) మధ్య యుద్ధం భారత్ లో క్రమంగా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఎల్బీజీ, ఇంధన కొరతతో పలు హోటల్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుండగానే ప్రజల నెత్తిన మరో పిడుగు పడే సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే మార్చి చివరి నాటికి ఔషధాల ధరలు భారీగా పెరిగే (Medicine Prices Rise) అవకాశం ఉందనే ఆందోళనలు ఫార్మా రంగంలో (Pharma Sector India) వినిపిస్తున్నాయి. హార్మూజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేయడంతో ఈ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. ఈ నేపథ్యంలో బఫర్ స్టాక్స్ క్షీణించడం, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో మార్చి చివరి నుండి ఔషధాలు అనుబంధ ఉత్పత్తుల ధరలు 10-20 శాతం పెరగవచ్చని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇన్ ఆర్గానికి కోవిడ్ పరిస్థితులు:
తాజా పరిస్థితులు ప్రస్తుతం క్రూడాయిల్ ధర రూ. 100 డాలర్లకు చేరింది. పెరిగిన ఇంధన ధరలు మందుల తయారీలో వాడే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్ (APIs), పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలను నేరుగా పెంచుతాయి. భారతదేశం తన APIలలో సుమారు 15-16 శాతం యూరప్ నుండి దిగుమతి చేసుకుంటుంది, ఇవన్నీ హర్మూజ్ జలసంధి (Strait of Hormuz Crisis) ద్వారానే వస్తాయి. అదనంగా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాల నుండి సేకరించే కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (KSMలు), ద్రావకాలు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి. హార్మూజ్‍పై ఇరాన్ ఆంక్షలు, ఇతర దేశాల నుంచి దిగుమతుల భారంతో ముడి సరుకుల లభ్యత, సరఫరా గొలుసుపై ఏకకాలంలో ఒత్తిడి పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో తాజా పరిస్థితులను ఇనార్గానిక్ కోవిడ్ పరిస్థితులతో మార్కెట్ నిపుణులు పోలుస్తున్నారు.
ఎగుమతుల సవాళ్లు:
పెట్రోలియం బై ప్రొడక్ట్స్ ఉత్పత్తులు ఇప్పటికే ఖరీదైనవిగా మారాయని ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ప్రభావం పడి పంపిణీ మందగించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మార్చి చివరి తర్వాత దగ్గు సిరప్‌లు, గ్లిజరిన్, మాస్క్‌ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక అమెరికా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఔషధ ఎగుమతిదారుగా భారత్ ఉంది. అనేక భారతీయ ఔషధాలను యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) అనుమతి పొందింది. గల్ఫ్ మరియు ఆఫ్రికన్ మార్కెట్లకు పెద్ద ఎత్తున రవాణా చేస్తుంది. హార్ముజ్ జలసంధి అంతరాయంతో దుబాయ్, ఒమన్, ఆఫ్రికన్ దేశాల వంటి కేంద్రాలకు ఎగుమతుల జాప్యం, దారి మళ్లించేందుకు ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ఇబ్బదులు ఎదుర్కొంటుండగా ఆ జాబితాలో ఫార్మా ఉత్పత్తులు సైతం చేరనుండటం ఆందోళన కలిగిస్తోంది.






