- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భగ్గుమన్న పెట్రోల్ ధరలు.. ఏకంగా 50 శాతం పెంపు.. ట్రంప్ నిర్ణయంతో సొంత ప్రజలకు కష్టాలు
ఇరాన్‌తో యుద్ధం మరియు హార్ముజ్ జలసంధి మూసివేత కారణంగా అమెరికాలో పెట్రోల్ ధరలు 50 శాతం పెరిగాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయిందనే చందగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ (Operation Epic Fury) పేరుతో ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధం యూఎస్ ప్రజల నెత్తిన పిడుగు పడేలా చేస్తోంది. ఇరాన్‍తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి యునైటెడ్ స్టేట్స్‌లో ఇంధన ధరలు గణనీయంగా పెరిగడం అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేకెత్తిస్తోంది. ఏఏఏ (AAA) గణాంకాలను ఉటంకిస్తూ ఏపీ (AP) నివేదించిన ప్రకారం అమెరికాలో యుద్ధం ప్రారంభం కావడానిక కంటే ముందు ఇప్పుడు సుమారు 50 శాతం ఇంధన ధరలు అధికంగా ఉన్నట్లు తెలిపింది. హార్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ చమురు సరఫరాలో ఏర్పడిన అంతరాయాల వల్ల యూఎస్ ప్రజలపై ఈ చమురు భారం పడుతోంది.
మరింత పెరిగే అవకాశం:
ప్రపంచవ్యాప్త ముడి చమురులో సుమారు ఐదో వంతు రవాణా ఈ హార్మూజ్ జలసంధి గుండా జరుగుతుంది. యుద్ధం వల్ల ఈ మార్గం ప్రభావితం కావడంతో చమురు ట్యాంకర్లు నిలిచిపోయి ప్రపంచ ముడి చమురు ధరలను పెంచుతున్నాయి. ప్రారంభ కాల్పుల విరమణ ప్రకటన తర్వాత ఘర్షణ ముగుస్తుందనే ఆశాభావంతో ముడి చమురు మరియు పెట్రోల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ ఇటీవలే ఇరాన్ ప్రతిపాదన తనకు నచ్చలేదని యుద్దం ముగించే అవకాశాలు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కాల్పుల విరమణపై ఇంకా ఎలాంటి స్పష్టమైన ప్రకటన రావడం లేదు. దీంతో ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా హార్మూజ్ లో సాధారణ పరిస్థితిలు నెలకొలేదు. దీంతో ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. ప్రభుత్వం లేదా మార్కెట్ వ్యక్తులు ఏమి ఆలోచించినా హార్ముజ్ జలసంధిపై ఆంక్షలు ఉన్న ప్రతిరోజూ ధరలపై ఒత్తిడి ఉంటుందని స్మిత్ హెచ్చరించారు. ఎస్ అండ్ పీ (S&P) గ్లోబల్ ఎనర్జీ డైరెక్టర్ రాబ్ స్మిత్ తెలిపారు.
ట్రంప్ నిర్ణయంతో ఆ భారం ప్రజలపే:
అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (EIA) ప్రకారం అమెరికాలో ఒక గాలన్ గ్యాసోలిన్ ధరలో ముడి చమురు వాటా సుమారు 51 శాతంగా ఉంది. హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల చమురు మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద సరఫరా అంతరాయం ఏర్పడిందని అంతర్జాతీయ ఇంధన సంస్థ వివరించింది. దీనివల్ల ఏప్రిల్ ప్రారంభంలో ముడి చమురు ధర బ్యారెల్‌కు 112 యూఎస్ డాలర్ దాటింది. ఇక ఏప్రిల్‌లో ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయం కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ఎగుమతులను నిరోధించడం ద్వారా ట్రంప్ ప్రభుత్వం ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని చూసిందని అది ప్రపంచ చమురు ధరలు పెరగడానికి కారకమైందని రైస్ యూనివర్శిటీకి చెందిన జిమ్ క్రాన్ తెలిపారు. అయితే యుద్ధం తగ్గినా కూడా సరఫరా ముప్పు మరికొన్ని నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని నిపుణలుు హెచ్చరిస్తున్నారు.






