Sonia Gandhi : సోనియాగాంధీపై కేసు నమోదుకు కోర్టులో పిటీషన్!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-02 08:17:16  IST  )

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ(Sonia Gandhi)చేసిన వ్యా్ఖ్యలు ఆమెను మరోసారి చిక్కుల్లో పడేసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించిన రాష్ట్రపది ద్రౌపది ముర్మును 'పేద మహిళ' (Poor Lady) అని అభివర్ణించినందుకు బీహార్(Bihar)లోని ముజఫర్ పూర్(Muzaffarpur) జిల్లాలోని ఓకోర్టులో సోనియాగాంధీపై పిటీషన్ దాఖలైంది.

Sonia Gandhi : సోనియాగాంధీపై కేసు నమోదుకు కోర్టులో పిటీషన్!
X

దిశ, వెబ్ డెస్క్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ(Sonia Gandhi)చేసిన వ్యా్ఖ్యలు ఆమెను మరోసారి చిక్కుల్లో పడేసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించిన రాష్ట్రపది ద్రౌపది ముర్మును 'పేద మహిళ' (Poor Lady) అని అభివర్ణించినందుకు బీహార్(Bihar)లోని ముజఫర్ పూర్(Muzaffarpur) జిల్లాలోని ఓకోర్టులో సోనియాగాంధీపై పిటీషన్ దాఖలైంది. భారతదేశ అత్యున్నత రాజ్యాంగ అధికారాన్ని అవమానపరిచినందుకు సోనియా గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ముజఫర్‌పూర్‌కు చెందిన న్యాయవాది సుధీర్ ఓజా కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిని కోర్టు విచారణకు స్వీకరించగా, ఈ కేసు ఫిబ్రవరి 10న విచారణకు రానుంది.

ఈ కేసులో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాలను కూడా సహ నిందితులుగా పిటిషనర్ పేర్కొన్నారు. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించడానికి ప్రయత్నించారని పిటిషనర్ సుధీర్ ఆరోపించారు. బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా గాంధీ రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్య చాలా అభ్యంతరకరంగా ఉందని.. రాష్ట్రపతి ఒక మహిళ అని, గిరిజన సమాజం నుండి వచ్చారని, ఆమెపై ఈ వ్యాఖ్య అభ్యంతరకరమని ఓజా తన పిటిషన్ లో ఆక్షేపించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం తర్వాత సోనియా గాంధీ పాత్రికేయులతో మాట్లాడుతూ సుదీర్ఘ ప్రసంగం చివరికి వచ్చే సరికి..పాపం పూర్ లేడీ..అలసిపోయింది' అని కామెంట్ చేశారు. అదే సమయంలో అక్కడే ఉన్న రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బోరింగ్ గా అభివర్ణించారు. కాగా సోనియా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. సోనియా వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఇది దురదృష్టకర, అవమానకర వ్యాఖ్య అని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. ప్రసంగం సమయంలో అలసిపోలేదు. నిజానికి, ఆమె ప్రసంగం ప్రధానంగా పేదల, మహిళల, రైతుల హక్కుల కోసం, వారికి మంచి చేయడం కోసం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అంగీకారయోగ్యమైనవి కాదని రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. భవన్ ప్రకటనలో కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు సత్యానికి విరుద్ధమైనవని పేర్కొన్నారు.

సోనియా గాంధీ వ్యాఖ్యపై ప్రధాని మోదీ(Prime Minister Modi) మాట్లాడుతూ నేడు దేశం మరోసారి కాంగ్రెస్ రాజకుటుంబ అహంకారాన్ని చవిచూసిందని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశం సాధించిన విజయాలు, దార్శనికత గురించి ఆమె దేశ ప్రజలకు తెలియజేశారు. హిందీ ఆమె మాతృభాష కాదు, అయినప్పటికీ ఆమె చాలా చక్కగా మాట్లాడారు. కానీ కాంగ్రెస్ రాజకుటుంబం ఆమెను అవమానించడం ప్రారంభించింది. ఇది దేశంలోని గిరిజన సోదరసోదరీమణులకు అవమానకరం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

గతంలోనూ కేసులు

కాగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీపై గతంలో నేషన్ హెరాల్డ్ కేసు కొనసాగుతోంది. పీఎం కేర్ ఫండ్స్(PM CARES Funds)కు సంబంధించి గతంలో సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆమెపై ఎఫ్ఆర్ నమోదైంది. కర్ణాటకలోని శివమొగ్గలో ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు పోలీసులు సోనియాగాంధీ మీద పలు సెక్షన్ల కింద ఎఫ్ఆర్ నమోదు చేశారు. కేవీ ప్రవీణ్ అనే న్యాయవాది సోనియాగాంధీ మీద ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ధోరణిలో వ్యాఖ్యలను పోస్ట్ చేశారని ఆరోపించారు. పీఎం కేర్స్ ఫండ్ మీద సోనియాగాంధీ తప్పుడు ఆరోపణలు చేశారని న్యాయవాది ప్రవీణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలతో సోనియాగాంధీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.

Next Story