ఏఐలో పొలిటీషియన్ల ఆర్థిక లావాదేవీలు.. కొత్త ఫీచర్ తెస్తున్న పర్‌ప్లెక్సిటీ!

by Phanindra |

ఏఐలో పొలిటీషియన్ల ఆర్థిక లావాదేవీలు వెల్లడించే కొత్త ఫీచర్ తెస్తున్నట్లు పర్‌ప్లెక్సిటీ సీఈవో శ్రీనివాస్ ప్రకటించారు.

ఏఐలో పొలిటీషియన్ల ఆర్థిక లావాదేవీలు.. కొత్త ఫీచర్ తెస్తున్న పర్‌ప్లెక్సిటీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశంలో రాజకీయ నాయకులు స్టాక్ మార్కెట్లో ఎంత సంపాదిస్తున్నారో ఎప్పటికప్పుడు వివరాలు అందించే ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నట్లు పర్‌ప్లెక్సిటీ ఏఐ సీఈవో అరవింద్ శ్రీనివాస్ ప్రకటించారు. అమెరికాలో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ చర్చతో రాజకీయ నేతల ఆర్థిక లావాదేవీలను సామాన్యులు కూడా తెలుసుకోవచ్చని, దీంతో పారదర్శకత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అమెరికాలో ఉన్న ఈ ఫీచర్‌ గురించి ఎక్స్ వేదికగా అడిగిన ప్రశ్నకు శ్రీనివాస్ నేరుగా సమాధానమిచ్చారు.

‘భారతీయ రాజకీయ నాయకుల హోల్డింగ్స్ వివరాలు కొన్ని వారాల్లోనే అందుబాటులోకి తెస్తాం’ అని ప్రకటించారు. ప్రస్తుతం ఒక పొలిటీషియన్ వద్ద ఏ కంపెనీకి చెందిన ఎన్ని షేర్లున్నాయి? ఇటీవల ఏ షేర్లను అమ్మారు? లేదా కొన్నారు? అనే వివరాలన్నీ పర్‌ప్లెక్సిటీ ఫైనాన్స్ ఫీచర్ అందిస్తుంది. అయితే భారత పొలిటీషియన్లు బినామీల పేర్లతో ఇలాంటి లావాదేవీలు చేపడతారని, కాబట్టి వారి వివరాలను నిర్ధారించడం అసాధ్యమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story