బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు హిల్సా చేపల ఎగుమతికి అనుమతులు

by Malleboina Mahesh |

భారత్‌కు హిల్సా చేపల ఎగుమతికి బంగ్లాదేశ్‌ ప్రభుత్వం స్థానిక జాలర్లు, ఎగుమతి దారులలకు అనుమతినిచ్చింది.

బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు హిల్సా చేపల ఎగుమతికి అనుమతులు
X

దిశ, వెబ్ డెస్క్: మరో రెండు వారాల్లో భారతదేశంలో దుర్గాదేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు హిల్సా చేపల ఎగుమతికి (Hilsa fish export) బంగ్లాదేశ్‌ ప్రభుత్వం స్థానిక జాలర్లు, ఎగుమతి దారులలకు అనుమతినిచ్చింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ (Ministry of Commerce) తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 1,200 మెట్రిక్ టన్నుల హిల్సా (స్థానికంగా ఇలిష్‌) ఎగుమతికి షరతులతో కూడిన ఆమోదం లభించింది. ఆసక్తి ఉన్న ఎగుమతిదారులు సెప్టెంబర్ 11 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. కాగా గతంలో కూడా దుర్గాపూజకు ముందు బంగ్లాదేశ్‌ (Bangladesh) ప్రత్యేక అనుమతుల ఆధారంగా భారత్‌కు హిల్సా ఎగుమతి చేసింది.

2024లో తొలిసారి వచ్చిన ప్యాడ్మా హిల్సా సుమారు 2,420 టన్నులు భారత్‌కు చేరింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని హౌరా మార్కెట్‌లో ఈ చేపలపై విపరీతమైన డిమాండ్ ఉండగా, ప్రస్తుతం అక్కడి హోల్‌సేల్ ధర కిలోకు రూ.1,400 నుంచి రూ.1,600 వరకు ఉంది. రుచికి ప్రసిద్ధి చెందిన ఈ చేప పేట్రాపోల్-బెనాపోల్‌ సరిహద్దు గుండా చేరి, కోల్‌కతా సహా పలు రిటైల్ మార్కెట్లో పంపిణీ అవుతుంది. 2012 నుంచి బంగ్లాదేశ్‌ హిల్సా చేపల ఎగుమతిపై నిషేధం విధించినప్పటికీ, 2019 నుంచి దుర్గా పూజ సందర్భంగా ప్రత్యేక అనుమతులు ఇస్తూ వస్తోంది.

Next Story