- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళలో యూడీఎఫ్‌పై ప్రజల విశ్వాసం పెరిగింది: రాహుల్ గాంధీ
కేరళ స్థానిక సంస్థలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: కేరళ స్థానిక సంస్థలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు జరిగింది. ఇందులో అధికార ఎల్డీఎఫ్ కు ఊహించని షాక్ తగలగా, యూడీఎఫ్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఈ పలితాలపై రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్‌లో ఈ ఎన్నికల ఫలితాలు UDF కూటమి పట్ల ప్రజలకు పెరిగిన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ విజయం "నిర్ణయాత్మకమైన, హృదయాన్ని ఆకట్టుకునే తీర్పు" అని రాహుల్ గాంధీ పేర్కొంటూ.. తమ అభ్యర్థులకు ఓటు వేసిన కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయాన్ని ఖాయం చేయడమే కాక, రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పును సూచిస్తున్నాయని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా, కేరళ ప్రజలు ప్రస్తుతం ఉన్న ఎల్‌డీఎఫ్ (LDF) పాలనలతో విసిగిపోయారని, దీనికి ప్రత్యామ్నాయంగా తాము జవాబుదారీగా ఉండే, ప్రజల సమస్యలను విని, స్పందించి పరిష్కరించే పరిపాలనను అందించగలమనే విశ్వాసం ప్రజలలో పెరిగిందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వివరించారు.
పారదర్శక, ప్రజలే ముందుండే పరిపాలన
యూడీఎఫ్ తన దృష్టిని ఇప్పుడు కేరళలోని సామాన్య ప్రజల పట్ల నిబద్ధత ఉంచింది. ప్రజల రోజువారీ సమస్యలను పరిష్కరించడం, పారదర్శకమైన, ప్రజలకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చే (People-First) పాలనను అందించడం తమ ఏకైక లక్ష్యమని వారు ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతినిధులందరికీ అభినందనలు తెలిపిన యూడీఎఫ్ నాయకత్వం, ఈ విజయం సాకారం కావడానికి అంకితభావంతో కృషి చేసిన ప్రతి పార్టీ నాయకుడికి, కార్యకర్తకు తన హృదయపూర్వక ప్రశంసలు తెలియజేసింది. ఈ స్థానిక ఎన్నికల్లో విజయం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒక బలమైన పునాది వేస్తుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూడీఎఫ్ ముందుకు సాగుతుందని వారు నొక్కి చెప్పారు.






