- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: తాగేందుకు స్వచ్ఛమైన నీరు లేదు కానీ.. సైకిల్ ట్రాక్స్ కావాలా?
“ప్రజలకు తాగేందుకు శుద్ధ జలాలు లేవు కానీ.. మీరు సైకిళ్ల ట్రాక్స్ కోసం పగటి కలలు కంటున్నారా?” అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

దిశ, నేషనల్ బ్యూరో: “ప్రజలకు తాగేందుకు శుద్ధ జలాలు లేవు కానీ.. మీరు సైకిళ్ల ట్రాక్స్ కోసం పగటి కలలు కంటున్నారా?” అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సైకిళ్ల కోసం దేశంలో ప్రత్యేకంగా ట్రాక్‌లు (cycle tracks) ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలైంది. దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు.. ఈ అభ్యర్థనపై పైర్ అయ్యింది. ‘‘ఒకసారి మురికివాడకు వెళ్లి చూడండి. వారి పరిస్థితి ఎలా ఉందో కనుక్కోండి. కనీస సౌకర్యాలు ఉన్నాయో లేవో చూడండి. ప్రజలకు ఇళ్లు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద డబ్బు లేదు. తాగేందుకు స్వచ్ఛమైన జలాలు లేవు. అలాంటిది సైకిల్ ట్రాక్‌ల గురించి పగటి కలలు కంటున్నారా?’’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
ప్రత్యేక ట్రాక్ కు కావాలని కోరుతూ..
అనేక రాష్ట్రాల్లో రోడ్లపై సైకిళ్ల కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఉన్నాయని.. దేశవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని కల్పించాలంటూ సైక్లింగ్ ప్రమోటర్ దవీందర్ సింగ్ నాగి దాఖలు చేసిన పిల్ పైనే సుప్రీంకోర్టు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు గేట్లలో ఒకదాని వెలుపల కూడా సైకిల్ ట్రాక్ ఉందని ఆయన అన్నారు నగరాలు, పట్టణాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించే అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. అయితే, ఈ పిటిషన్ పైనే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మనం అసలు ఎలాంటి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం?. వాటిపై ఒకసారి పరిశీలన అవసరం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉద్దేశాన్ని గుర్తు చేసుకోండి. తాగేందుకు సరైన నీటి సౌకర్యం లేదు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. కానీ, మీకు మాత్రం సైకిల్ ట్రాక్‌లు కావాలా..?’’ అంటూ కోర్టు ప్రశ్నించింది.






