- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూఎస్ తాజా ఆదేశాలతో హార్వర్డ్‌కు వచ్చే విద్యార్థులపై మరింత నిఘా!
హార్వర్డ్‌కు వచ్చే విద్యార్థులపై నిఘా పెంచాలని యూఎస్ సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలోనే కాన్సులర్ ఆఫీసులకు ఆదేశాలు జారీచేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీకి ఏ పని మీదైనా విదేశీయులు వస్తుంటే వారి వీసా దరఖాస్తులపై మరింత దర్యాప్తు చేయాలని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలు జారీచేసిందట. ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ ప్రభుత్వానికి మధ్య గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు అన్నిదేశాల్లోని యూఎస్ దౌత్యవేత్తలకు, కాన్సులర్ ఉద్యోగులకు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో నుంచి ఈ తాజా ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, అతిథి స్పీకర్లు, టూరిస్టులు.. ఇలా ఏ రకంగానైనా హార్వర్డ్‌కు వస్తున్న వారి వీసా దరఖాస్తులపై అదనంగా దర్యాప్తు జరగాలనేది ఈ ఆదేశాల సారాంశం. క్యాంపస్‌లో హింస, యాంటీ సెమిటిజం లేకుండా చూసుకోవడంలో హార్వర్డ్ యూనిర్శిటీ విఫలమైనట్లు ఈ ఆదేశాలు పేర్కొన్నాయట. హార్వర్డ్‌కు వచ్చే వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాలు ప్రైవేట్‌లో ఉంటే, వాటిని పబ్లిక్ చేయించి మరీ చెక్ చేయాలని యూఎస్ ఆదేశించినట్లు తెలుస్తోంది.






