- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఒక్క నిమ్మకాయకు రూ.13వేలు’.. షాక్‌లో ప్రజలు.. ఎక్కడంటే?
రాష్ట్రంలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడు(Tamilnadu) లో ఒక్క నిమ్మకాయ రూ.13వేలు పలికింది. ఈరోడ్ జిల్లా విలకేతి గ్రామంలోని పళమ్తిన్ని కరుప్ప ఈశ్వరన్ ఆలయంలో పూజా కార్యక్రమంలో ఉపయోగించే ఒక నిమ్మకాయ(Lemon)ను రూ.13వేలకు వేలం వేశారు. వార్షిక మహా శివరాత్రి(Maha Shivaratri) పండుగలో భాగంగా బుధవారం అర్ధరాత్రి బహిరంగ వేలం నిర్వహించారు. శివరాత్రి పర్వదినాన ఆలయంలో పవిత్రంగా భావించే నిమ్మకాయ కోసం భక్తులు పోటీ పడ్డారు. అయితే నిమ్మకాయకు ప్రతి ఏడాది వేలం వేయడం వారి ఆచారంగా వస్తుందన్నారు.
ఈ నేపథ్యంలోనే వేలంలో నిమ్మకాయ రికార్డ్ ధర(Record Price) పలికినట్లు ఆలయ అధికారులు ఇవాళ(శుక్రవారం) తెలిపారు. నిమ్మకాయతో పాటు ప్రధాన దేవత విగ్రహం పై ఉంచిన ఇతర వస్తువులను కూడా వేలం వేశారు. వాటిలో వెండి ఉంగరం కూడా ఉంది. ఈ క్రమంలో తంగరాజ్ అనే భక్తుడు నిమ్మకాయని రూ.13వేలకి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అరచలూరుకు చెందిన చిదంబరం వెండి ఉంగరాన్ని రూ.43,100కి కొనుగోలు చేయగా.. రవికుమార్, భానుప్రియ ఇద్దరు వెండి నాణేన్ని రూ.35వేలకు పొందారు. అయితే.. ఈ వస్తువులు తమ ఇళ్లలోకి తీసుకెళ్తే తమకు అంతా మంచే జరుగుతుందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు.






