- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Nitish Kumar: బిహార్‌లో పెన్షన్ల పెంపు
రాష్ట్ర సామాజిక భద్రతా పెన్షన్ పథకంలో రూ. 1100 లకు పెంచుతున్నట్లు బిహార్ సీఎం నితీష్ కుమార్ శనివారం ఎక్స్ ట్విటర్ లో ప్రకటించారు.

దిశ,నేషనల్ బ్యూరో: రాష్ట్ర సామాజిక భద్రతా పెన్షన్ పథకంలో రూ. 1100 లకు పెంచుతున్నట్లు బిహార్ సీఎం నితీష్ కుమార్ శనివారం ఎక్స్ ట్విటర్ లో ప్రకటించారు. ఇప్పటి వరకు రూ.400 అందుతుండగా పెంచిన పెన్షన్ జులై నెల నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా 1.09 కోట్ల లబ్ధిదారులకు లాభం చేకూర్చనుంది. సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద వితంతువులు, వృద్ధులు, వికలాంగులు నెలకు రూ.400కి బదులుగా రూ.1100 పెన్షన్ పొందనున్నారు. పెరిగిన పెన్షన్ ప్రతి నెల 10వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది. ఈ స్కీం బిహార్ ప్రభుత్వం అమలు చేస్తున్న అంబ్రెల్లా పథకంలో భాగంగా ఉంటుంది. ఇందులో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇతర అర్హులైన గిరిజనులు, మహిళలు, అనాథలు మొదలైన వారు లబ్ధిదారులుగా ఉంటారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో
ఈ నేపథ్యంలో బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి స్పందిస్తూ ఇది చారిత్రాత్మక రోజు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వృద్ధులు, వితంతువులు, ప్రత్యేక అవసరాలు ఉన్న వారికి పెద్ద సహాయాన్ని అందిస్తూ పెన్షన్లను పెంచారు. ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ప్రకటించారు. ఇక రాష్ట్రంలో అక్టోబర్-నవంబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని రాజకీయపరంగా కీలకంగా భావిస్తున్నారు. వృద్ధులు, మహిళలు, నిరుపేదలు సామాజికంగా వెనుకబడిన వర్గాలపై ఈ పెన్షన్ పెంపు ప్రభావం చూపే అవకాశం ఉంది.ఈ పెంచిన పెన్షన్ ను ప్రతి నెల 10వ తేదీన పెరిగిన పెన్షన్‌ను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. బిహార్‌లోని సామాజిక సంక్షేమాన్ని బలోపేతం చేయడంలో కీలక అడుగుగా భావిస్తున్నారు.






