- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక లీటర్ల లెక్కే! హాట్ సమ్మర్‍లో కొత్త ట్రెండ్.. టూ మచ్ అంటూ నెటిజన్ల రియాక్ట్
బొండాం లెక్క కాదు.. ఇక లీటర్ల లెక్కే! బెంగళూరులో కొబ్బరి నీళ్ల ధర చూసి నెటిజన్లు షాక్. హైదరాబాద్, హర్యానాలోనూ ఇదే బాటలో వ్యాపారులు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ప్రజలు శీతల పానియాలతో పాటు కొబ్బరి నీళ్ల వైపు చూస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్‍కు అనుగుణంగా కొబ్బరి నీళ్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే దేశంలో ఐటీ హబ్‍గా పేరు గాంచిన బెంగళూరు నగరంలో ఓ కొబ్బరి బోండాల వ్యాపారి సాధారణ విక్రయాలకు భిన్నంగా అమ్మకాలు సాగిస్తుండటం అందుకు భారీగా ధర ఫిక్స్ చేయడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
1 లీటర్ రూ.180:
సాధారణంగా మన దేశంలో కొబ్బరి నీళ్లను ‘బొండాం’ లెక్కన లేదా బాటిళ్లలో అమ్ముతారు. కానీ ఇందుకు భిన్నంగా బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి నీళ్లను ఇప్పుడు లీటరు చొప్పున విక్రయిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ వ్యాపారి తన కొట్టు ముందు ఒక లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 అనే బోర్డు ఏర్పాటు చేయగా రీతూ జాన్ అనే ఎక్స్ యూజర్ ఈ బోర్డుకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. అలాగే కొబ్బరి నీళ్లను లీటర్ల లెక్కన అమ్మడం నేను కేవలం బెంగళూరులోనే చూశాను అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టుపై స్పందించిన నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ రియాక్ట్ అవుతూ ఇవాళ నేను కూడా మొదటిసారి హర్యానాలో ఇలాంటిదే చూశానని చెప్పగా, మరికొందరు లీటర్ కు ధర రూ.180 టూ మచ్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ హైదరాబాద్‌లో కూడా కొబ్బరి నీళ్లను ఒక్కో బొండాం లెక్కన లేదా లీటర్ల లెక్కన అమ్ముతున్నారు. బొండాం లెక్కన కొంటే అందులో ఎంత పరిమాణం (quantity) వస్తుందనే గ్యారెంటీ ఉండదు, అందుకే ఈ లీటర్ల పద్ధతి అందుబాటులోకి వచ్చిందని కామెంట్ చేశారు. మొత్తంగా కొబ్బరినీళ్ల విక్రయాల్లో కొత్త ట్రెండ్ తో పాటు బెంగళూరులో పెరిగిపోతున్న ధరల పై జోరుగా చర్చ జరుగుతోంది.






