- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రంప్‌కు శాంతి బహుమతి
ఎప్పుడూ వివాదాస్పద నిర్ణయాలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రపంచ దేశాలకు సమస్యలు తెచ్చిపెట్టే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కల నెరవేరబోతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఎప్పుడూ వివాదాస్పద నిర్ణయాలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రపంచ దేశాలకు సమస్యలు తెచ్చిపెట్టే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కల నెరవేరబోతోంది. బెదిరించి, బతిమాలి ఎలాగైనా శాంతి బహుమతి పొందాలని చూసిన ట్రంప్‌కు నోబెల్ బహుమతుల్లో నిరాశే ఎదురైంది. తనకు ఖచ్చితంగా నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ఎంతగానో ఎదురుచూడగా.. అదికాస్తా వెనిజులాకు చెందిన మరియా కొరినా మచాడేకు వెళ్ళింది. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యి, నోబెల్ బహుమతులు అందించే స్వీడన్ మీద ఇబ్బడిముబ్బడిగా టారిఫ్ లు వేసాడు.
అయితే ఎట్టకేలకు ట్రంప్ శాంతి బహుమతి కల నెరవేరబోతోంది. నోబెల్ NO అన్న అమెరికా పెద్దన్నను అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఆదుకుంటోంది. వాషింగ్టన్‌లో వరల్డ్ కప్ డ్రా వేదికపై ఈ సారి కొత్తగా ఫిఫా పీస్ ప్రైజ్ ఇస్తామని ప్రకటించింది. FIFA చీఫ్ గయానీ ఫుట్‌బాల్-పీస్ రిలేషన్‌ను కలుపుతూ.. మొదటి శాంతి బహుమతిని ట్రంప్‌కు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మొత్తానికి ట్రంప్‌కు పట్టిన శాంతి బహుమతి పిచ్చి వదలబోతోంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






