- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సనాతన ధర్మం ఎంత ప్రమాదమో ఈ దాడితో పవన్ కల్యాణ్ తెలుసుకొవాలి: సీపీఐ నారాయణ
సోమవారం ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీజేఐ గవాయ్ సై 71 ఏళ్ల లాయర్ దాడికి యత్నించాడు.

దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టులో సోమవారం ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ (Supreme Court CJI) గవాయ్ పై 71 ఏళ్ల లాయర్ దాడికి యత్నించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారింది. దీంతో సీజేఐపై దాడిని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే సీపీఐ నారాయణ (CPI Narayana) కూడా సీజేఐ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. అత్యంత ఉన్నత న్యాయస్థానంలోనే సీజేఐకి రక్షణ లేకపోతే ఈ దేశం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి.
సనాతన ధర్మం కాలం చెల్లిందని తన అభిప్రాయం చెప్పిన సీజేఐపై దాడి చేయడం దారుణమని అన్నారు. సనాతన ధర్మం గురించి పదే పదే మాట్లాడే పవన్ కళ్యాణ్.. ఆ సనాతన ధర్మం ఎంత ప్రమాదమో తెలుసుకోవాలని అన్నారు. అలాగే జస్టిస్ గవాయ్ పై దాడిని పవన్ ఖండించాలని, దాడికి యత్నం చేసిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని తాము డిమాండ్ చేస్తున్నామని సీపీఐ నారాయణ చెప్పుకొచ్చారు.
- Tags
- CPI Narayana
- CJI






