- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిజిటల్ గవర్నెన్స్‌కు 'పాస్‌పోర్ట్' కార్యక్రమం ఆదర్శం: విదేశాంగ మంత్రి జైశంకర్
ఢిల్లీలో జరిగిన 'ఇండియాస్ వరల్డ్ యాన్యువల్ కాంక్లేవ్ 2025'లో విదేశాంగ మంత్రి జైశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత దశాబ్దంలో పాస్‌పోర్ట్ సేవలు, ప్రవాస భారతీయుల సంక్షేమంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించారు.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో జరిగిన 'ఇండియాస్ వరల్డ్ యాన్యువల్ కాంక్లేవ్ 2025'లో విదేశాంగ మంత్రి జైశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత దశాబ్దంలో పాస్‌పోర్ట్ సేవలు, ప్రవాస భారతీయుల సంక్షేమంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించారు. పది సంవత్సరాల క్రితం, పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి దేశంలో కేవలం 77 కేంద్రాలు మాత్రమే ఉండేవని, కానీ గత పదేళ్లలో 468 కొత్త కేంద్రాలను జోడించినట్టు ఆయన తెలిపారు.
పాస్‌పోర్ట్ జారీ వేగం, పత్రాల స్పష్టత వంటి అంశాలను క్రమబద్ధీకరించడం జరిగిందని, ఈ రోజుల్లో పాస్‌పోర్ట్ గురించి ఎవరూ మాట్లాడకపోవడమే ఈ విజయాన్ని సూచిస్తుందని అన్నారు. భారతదేశంలో డిజిటల్ గవర్నెన్స్‌కు 'పాస్‌పోర్ట్ కార్యక్రమం' ఒక ఆదర్శంగా (Poster Child) నిలిచిందని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయులకు సహాయం అందించడానికి తీసుకువచ్చిన 'మదద్' (MADAD) పోర్టల్‌ను కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. పదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ పోర్టల్ ద్వారా, గత మూడేళ్లలో ఒక్క గల్ఫ్ దేశాల్లో 1,38,000 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు.
అలాగే, ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ICWF) అనే మరో వ్యవస్థను కూడా విస్తరించినట్లు పేర్కొన్నారు. పాస్‌పోర్ట్, కాన్సులర్ సేవలపై సెస్ (పన్ను) ద్వారా సేకరించిన ఈ నిధిని కష్టాల్లో ఉన్న ప్రజల అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని, గత మూడేళ్లలో ఈ సంక్షేమ నిధి ద్వారా 2,38,000 మంది లబ్ధి పొందారని వివరించారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి విదేశీ పర్యటనల్లో, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లినప్పుడు, కార్మికులు పనిచేసే శిబిరాలను సందర్శించడం ఒక ఆనవాయితీగా (SOP) మారిందని, ఈ విధానం పై స్థాయి నుంచే మొదలు కావడంతో మిగిలిన వ్యవస్థకు కూడా సందేశం అందుతుందని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు.






