ఆగిపోయిన ఫ్లైట్.. ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

by Naga Rani Yarlagadda |

బెంగళూరులోని ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది.

ఆగిపోయిన ఫ్లైట్.. ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులోని ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చేందుకు మధ్యాహ్నం 2 గంటలకు ఉన్న ఎయిరిండియా విమానానికి టికెట్ తీసుకున్న ప్రయాణికులు ఊహించని చిక్కుల్లో పడ్డారు. సాయంత్రం 5.30 గంటలైనా విమానం టేకాఫ్ అవ్వకపోవడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడున్నర గంటలు ఎంతో ఓపికగా ఎదురుచూశామని, ఇంకెంతసేపు వెయిట్ చేయాలంటూ ఎయిరిండియా కౌంటర్ వద్ద సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో టెక్నికల్ సమస్య కారణంగా ఫ్లైట్ టేకాఫ్ కాలేదని, సమస్యను పరిష్కరిస్తామని చెప్పినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story