Amritsar Airport: అమృత్ సర్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

by Shamantha N |

పంజాబ్ లోని ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అమృత్‌సర్ విమానాశ్రయంలో సుమారు రూ.8 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Amritsar Airport: అమృత్ సర్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ లోని ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అమృత్‌సర్ విమానాశ్రయంలో సుమారు రూ.8 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తీసుకొస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 26న మలేషియా నుండి విమానంలో మన్దీప్ సింగ్ అనే ప్రయాణికుడు వచ్చాడని.. తనిఖీల్లో అతడి దగ్గర 8.17 కిలోల డ్రగ్స్ గుర్తించామన్నారు. ఆ డ్రగ్స్ విలువల రూ.8.17 కోట్లుగా ఉంటుందని గుర్తించారు. నిందితుడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్- 1985 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా, మరో కేసులో అక్రమంగా సరఫరా చేస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర 400 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. నిందితుడి నుంచి బంగారు గొలుసు, గాజుని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.35.60 లక్షలు ఉంటుందని వెల్లడించారు.

Next Story