రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు

by Disha Web Desk 9 |
రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు
X

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి మొదలవనున్న శీతాకాల సమావేశాల్లో రెండు ఆర్థిక బిల్లులతో సహా మొత్తం 21 బిల్లులు చర్చకు రానున్నాయి. 'వాటిలో మూడు బిల్లులు హోంమంత్రిత్వ శాఖ నుంచి కాగా, సెంట్రల్ యూనివర్శిటీ, రాజ్యాంగ ఉత్తర్వులకు సంబంధించిన చెరొక బిల్లు ఉంటాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అలాగే, జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2023, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లు, జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ చట్టాలు (ప్రత్యేక నిబంధనలు) రెండవ (సవరణ) బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులు ఉండనున్నాయి. అలాగే, పోస్ట్ ఆఫీస్ బిల్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) బిల్లులు ఉన్నాయి. ముఖ్యంగా ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల బిల్లులు ఈ పార్లమెంటు సమావేశాల్లో ముఖ్యమైనవి. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4న ప్రారంభమై 22న ముగుస్తాయని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.

Next Story

Most Viewed