Parliament: ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించాలి.. పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళన

by B.Srinivas |

పార్లమెంటులో వరుసగా నాలుగో రోజూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. బిహార్‌లో ఎస్ఐఆర్ పై చర్చించాలని డిమాండ్ చేశారు.

Parliament: ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించాలి.. పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళన
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటులో వరుసగా నాలుగో రోజూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. బిహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై చర్చించాలని డిమాండ్ చేశారు. లోక్ సభ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ వెల్ లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. దీంతో సభ జరిగే పరిస్థితి లేకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనా ప్రతిపక్షాలు మళ్లీ గందరగోళం సృష్టించడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అలాగే రాజ్యసభలోనూ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో రాజ్యసభ సైతం ఎటువంటి చర్చ లేకుండానే వాయిదా పడింది. అంతకుముందు ఇదే అంశంపై పార్లమెంట్ వెలుపల మకర్ ద్వార్ వద్ద ప్రతిపక్ష నాయకులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సైతం ఈ నిరసనలో పాల్గొన్నారు. ఎస్ఆర్ ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని, ఉభయసభల్లో దీనిపై చర్చించాలని డిమాండ్ చేశారు.

Next Story