రేపటి నుంచి వర్షాకాల సమావేశాలు.. కేంద్రం కీలక నిర్ణయం

by velandi.Saikiran |

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ( Parliament for monsoon session) ముహూర్తం ఖరారైంది. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల

రేపటి నుంచి వర్షాకాల సమావేశాలు.. కేంద్రం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ( Parliament for monsoon session) ముహూర్తం ఖరారైంది. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు అంటే జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు... ఈ పార్లమెంటు సమావేశాలు నిర్వహించబోతున్నారు. అంటే మొత్తంగా 21 రోజుల పాటు ఈ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పార్లమెంటు సభలకు విరామం ఇవ్వబోతున్నారు.

అయితే రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోంది కేంద్ర సర్కారు. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత పార్లమెంట్ అనే భవనంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ( Rajnath Singh) నేతృత్వంలో ఈ అఖిలపక్ష సమావేశం జరగనుంది.

ఈ అఖిలపక్ష సమావేశంలో.. కీలక విషయాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా జరిగేలా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే పార్లమెంటు ముందుకు ఏ బిల్లులు వస్తాయి...? ఎలాంటి సమస్యలను పార్లమెంటు ముందుకు తీసుకువెళ్లాలి.. ఇలా తదితర అంశాల పైన ప్రతిపక్ష అటు అధికార పక్షం మధ్య చర్చ జరుగుతుంది.

Next Story