- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్కింగ్ వివాదం.. 30 ట్రక్కులను ధ్వంసం చేసిన పోలీసులు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనొ కోల్‌కతా న్యూ అలిపోర్‌లో పార్కింగ్ సమస్య తీవ్ర స్థాయికి చేరింది.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనొ కోల్‌కతా (Kolkata) న్యూ అలిపోర్‌లో పార్కింగ్ సమస్య తీవ్ర స్థాయికి చేరింది. రోడ్డుపై పార్క్ చేసిన 30 ట్రక్కులను (Truks) పోలీసులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ట్రక్కు యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గత 40 ఏళ్లుగా అదే ప్రాంతంలో ట్రక్కులు పార్క్ చేస్తుంటే ఇప్పుడెందుకు ఇలాంటిది జరిగింది? పోలీస్ శాఖ ముందస్తు నోటీసు లేకుండానే ఈ చర్యకు పాల్పడింది' అని ట్రక్కు యజమానులు ఆరోపించారు. ట్రక్కులను బలవంతంగా తొలగించడమే కాకుండా కొన్ని నాశనం చేసినట్లు వారు చెప్పారు.
ఈ ఘటనపై తీవ్ర దుమారం చెలరేగడంతో కోల్‌కతా పోలీస్ శాఖ స్పందించింది. సంబంధిత ముగ్గురు పోలీసు అధికారులను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయం ప్రాథమిక స్థాయిలో విచారణ అనంతరం తీసుకున్నట్లు సమాచారం. పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని, కానీ ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు వెల్లడించారు. రోడ్డులో పార్కింగ్ వల్ల అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలకు ఆటంకం కలుగుతోందని వారు వివరణ ఇచ్చారు. అయితే, ట్రక్కు యజమానులు మాత్రం ఈ చర్యను అన్యాయంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






