- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూపీలో ఘోరం.. తల్లిదండ్రులను చంపి, ముక్కలుగా కోసి
యూపీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలు, ఆస్తుల పంపకాల విషయంలో జరిగిన గొడవ కారణంగా కుమారుడు తల్లిదండ్రులను హత్య చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: యూపీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలు, ఆస్తుల పంపకాల విషయంలో జరిగిన గొడవ కారణంగా కుమారుడు తల్లిదండ్రులను హత్య చేశాడు. అక్కడితో ఆగకుండా వారి డెడ్ బాడీలను రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి గోమతి నదిలో పడేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అంబేశ్ అనే వ్యక్తి ఈ నెల 8న రాత్రి ఇంట్లో గొడవ జరగటంతో తన తల్లి బబితను రోకలితో కొట్టి చంపాడు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన తండ్రి శ్యాం బహదూర్ ను సైతం రోకలి బండతో కొట్టి, గొంతుకు తాడు బిగించి హతమార్చాడు.
హత్యలు చేసిన అనంతరం డెడ్ బాడీలను రంపంతో ముక్కులుగా కోసి ఆరు ప్లాస్టిక్ సంచుల్లో నింపి కారులో తీసుకువెళ్లి నదిలో పడేశాడు. తరవాత తోబుట్టువులు తల్లిదండ్రుల గురించి అడగ్గా వారు బయటకు వెళ్లారని అబద్దం చెప్పాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి అతడు సైతం పారిపోయాడు. అతడి తోబుట్టువులకు అనుమానం రావడంతో డిసెంబర్ 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అంబేశ్ నేరాన్ని అంగీకరించడంతో కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.






