పప్పు యాదవ్ అరెస్ట్‌..35 ఏళ్ల కింది కేసు !

by velandi.Saikiran |

పార్లమెంట్ సభ్యులు పప్పు యాదవ్ ను ( Pappu Yadav) కాసేపటికి క్రిత‌మే అరెస్టు చేశారు పోలీసులు. ఓ ఫ్రాడ్ కేసులో ( 35-Year-Old Fraud Case) భాగంగా అరెస్ట్ చేసినట్లు స‌మాచారం.

పప్పు యాదవ్ అరెస్ట్‌..35 ఏళ్ల కింది కేసు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: పాట్నాలో ( Patna) కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాట్నాలో ఇండిపెండెంట్ పార్లమెంట్ సభ్యులు పప్పు యాదవ్ ను ( Pappu Yadav) కాసేపటికి క్రిత‌మే అరెస్టు చేశారు పోలీసులు. ఓ ఫ్రాడ్ కేసులో ( 35-Year-Old Fraud Case) భాగంగా అరెస్ట్ చేసినట్లు స‌మాచారం. ఒక్క‌సారిగా దాదాపు 50 మంది పోలీసులు పప్పు యాదవ్ ఇంటిని చుట్టు ముట్టేశారు. ఆ తర్వాత భారీ బందోబస్తు నడుమ పప్పు యాదవ్ ను అరెస్టు చేశారు. దాదాపు 35 సంవత్సరాల నాటి కింది కేసును తెరపైకి తీసుకువచ్చిన పోలీసులు...ఆ కేసు ఆధారంగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

పాట్నాలోని మందిరి ప్రాంతంలో ఉన్న పప్పు యాదవ్ నివాసానికి వచ్చిన పోలీసులు...నోటీసులు ఇచ్చి మరీ అరెస్టు చేశారు. అయితే అతని అరెస్టు చేసేందుకు దాదాపు మూడు గంటల టైం పట్టినట్లు తెలుస్తోంది. పప్పు యాదవ్ అనుచరులు రంగంలోకి దిగడంతో పోలీసులకు చుక్కలు కనిపించాయి. వైద్య పరీక్షల నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించి అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించే ఛాన్స్ ఉంది.

35 ఏళ్ల క్రితం కేసులో భాగంగా అరెస్ట్

1995 సంవత్సరంలో ఓ పాత నేరపూరిత కేసు నేపథ్యంలో పప్పు యాదవ్ ను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. వినోద్ బిహారి లాల్ అనే వ్యక్తి కి సంబంధించిన ఇంటిని అద్దెకు తీసుకొని ఆ తర్వాత కబ్జా చేశాడని పప్పు యాదవ్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వినోద్, పోలీసులకు ఫిర్యాదు చేశారట. ఈ నేపథ్యంలోనే ఫోర్జరీ, మోసం, అక్రమ ప్రవేశం, బెదిరింపులు, ఇలా అనేక రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో తాజాగా పప్పు యాద‌వ్ ను అరెస్టు చేశారు.


Next Story