భారత్ - పాక్ యుద్ధం.. అంతా ఆ గ్రహకూటమి వల్లేనా?

by Naga Rani Yarlagadda |

2025 మార్చి 29న మీన రాశిలో రాహు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని సంయోగంతో అమావాస్య నాడు షష్ఠగ్రహ కూటమి ఏర్పడింది.

భారత్ - పాక్ యుద్ధం.. అంతా ఆ గ్రహకూటమి వల్లేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడికి (pahalgam terror attack) ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (operation sindoor) నిర్వహించింది. ఈ మధ్యలో పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి.. పదుల సంఖ్యలో భారత పౌరుల ప్రాణాలను బలితీసుకుంది. ఇదంతా షష్ఠగ్రహ కూటమి వల్లేనన్న ప్రచారం ఊపందుకుంది. మార్చి 29న ఆరు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఇది ఏర్పడింది. ఈ సంయోగం కొన్ని రాశులపై సానుకూల, మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని పండితులు చెప్పారు. అయితే 2019 డిసెంబర్లో షష్ఠగ్రహ కూటమి ఏర్పడినపుడు కరోనా వ్యాప్తి చెందిందని, ఇప్పుడు కూడా అలాంటి వైరస్ వ్యాప్తి లేదా దేశాల మధ్య యుద్ధాలు జరిగే ఆస్కారం ఉందని చెప్పుకొచ్చారు.

2025 మార్చి 29న మీన రాశిలో రాహు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని సంయోగంతో అమావాస్య నాడు షష్ఠగ్రహ కూటమి ఏర్పడింది. దీని ప్రభావం ద్వాదశ రాశులపై, ప్రపంచ దేశాలపై మే 31, 2025 వరకు ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. షష్ఠగ్రహ కూటమి ఆర్థిక అస్థిరతలు, సామాజిక ఉద్రిక్తతలు, లేదా ప్రకృతి విపత్తులకు దారితీయవచ్చని కొందరు జ్యోతిష్యులు హెచ్చరించారు. ఫిబ్రవరి 2021లో ఏర్పడిన కూటమి సమయంలో కొన్ని దుష్పరిణామాలు జరిగాయని, అయితే ఇవి నేరుగా యుద్ధాలతో సంబంధం కలిగి లేవని పేర్కొన్నారు.

అయితే దేశాల మధ్య యుద్ధాలకు షష్ఠగ్రహ కూటమి (Shashtagraha Kutami) నేరుగా కారణమవుతుందని పంచాంగకర్తలు స్పష్టంగా చెప్పలేదు. కొన్ని సందర్భాల్లో రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సంబంధాలలో ఒత్తిడి, లేదా సైనిక సంఘర్షణల వంటి పరిస్థితులను ప్రేరేపించవచ్చని సూచనాత్మకంగా పేర్కొన్నారు. ఉదాహరణకు, కుజుడు (మంగళ గ్రహం) షష్ఠగ్రహ కూటమిలో ఉన్నప్పుడు.. దూకుడు, సంఘర్షణలకు అవకాశం ఉంటుందని జ్యోతిష్యులు హెచ్చరించారు.

జ్యోతిష్యులు చెప్పినదాని ప్రకారం.. మార్చి 31 నుంచి ఏప్రిల్ 13 వరకూ పంచగ్రహ కూటమి కారణంగా అకాల మరణాలు సంభవిస్తాయి. మే 16 నుంచి సంవత్సరం చివరి వరకూ ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. జూన్ 7 నుంచి జులై 28 మధ్య బిహార్, వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. జులై 29 నుంచి సెప్టెంబర్ 14 వరకూ సౌత్ స్టేట్స్ లో దుర్భిక్షం, ఆహారం కొరత, అంతర్గత వైషమ్యాలతో దాడులు జరిగే ఆస్కారం ఉంది. దేశ విదేశాల్లో విమాన ప్రమాదాలు, యుద్ధం వంటి విపత్కర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియా - పాకిస్థాన్ ల మధ్య నెలకొన్ని పరిస్థితులకు పూర్తిగా షష్ఠగ్రహ కూటమే కారణమని చెప్పకపోయినా.. దాని ప్రభావం కూడా కొంత ఉంటుందని పండితులు చెప్తున్నారు. డిసెంబరు 20నుంచి.. 2026 జనవరి 12 మధ్య ప్రకృతి విలయ తాండవం, సముద్రంలో అలజడులు, యుద్ధభయం ఉంటుంది. జనవరి 17 ఫిబ్రవరి 2 తేదీ మధ్య పొగమంచు, విమాన ప్రమాదాలు, రహదారి మార్గాలకు అంతరాయం వంటి ఇబ్బందులు ఎదుర‌వుతాయని కూడా చెప్పారు.

Next Story