- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Panama: పనామాలోని భారతీయులు సేఫ్.. ఇండియన్ ఎంబసీ ప్రకటన
అమెరికా నుంచి బహిష్కరించిన భారతీయ అక్రమ వలసదారులను పనామాకు పంపించిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా నుంచి బహిష్కరించిన భారతీయ అక్రమ వలసదారులను పనామాకు పంపించిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఓ హోటల్‌లో ఉన్న ఇండియన్స్ ఇబ్బందులు పడుతున్నారని పలు కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో పనామా (Panam), నికరాగ్వా (Nikaraga), కోస్టారికా (Coastarica) దేశాల్లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. పనామాలో ఉన్న భారతీయులు సురక్షితంగా ఉన్నారని తెలిపింది. అన్ని సౌకర్యాలతో కూడిన హోటల్‌లోనే బసచేస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘భారతీయుల బృందం అమెరికా నుంచి పనామా చేరుకున్నట్లు అక్కడి అధికారులు మాకు తెలియజేశారు. ఇండియన్స్‌కు కావాల్సిన అన్ని వసతులు హోటల్‌లో కల్పించారు. వారిని కలవడానికి రాయబార కార్యాలయం అనుమతి తీసుకుంది. సేఫ్ గా ఇండియా పంపించడానికి పనామా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం’ అని తెలిపింది.
కాగా, అమెరికా నుంచి వివిధ దేశాలకు చెందిన 300 మంది వలసదారులు పనామాకు చేరుకున్నారు. వారిని స్వీకరించిన పనామా వారందకీ ఓ హోటల్‌లో వసతి కల్పించింది. అందులో 30 మంది భారతీయ వలసదారులు ఉన్నారు. అయితే వారికి ఆహారం, తగిన సదుపాయాలు లేవని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అంతేగాక వారి మొబైల్ ఫోన్లు లాక్కుని నిర్భంధించాలని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంబసీ స్పందించి క్లారిటీ ఇచ్చింది.






