పన్నీర్ సెల్వంకు హైకోర్టులో షాక్.. ‘అమ్మ’ వారసుడిగా పళనిస్వామి

by Malleboina Mahesh |

జయలలిత వారసుడిగా పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ఆధిపత్య వార్‌కు తమిళనాడు హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది.

పన్నీర్ సెల్వంకు హైకోర్టులో షాక్.. ‘అమ్మ’ వారసుడిగా పళనిస్వామి
X

దిశ, డైనమిక్ బ్యూరో: జయలలిత వారసుడిగా పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ఆధిపత్య వార్‌కు తమిళనాడు హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రస్తుతం అన్నాడీఎంకే సారథిగా ఉన్న పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు దక్కాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నిక సహా గత ఏడాది జూలై 11న ఆమోదించిన తీర్మానాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి నిర్వహించిన ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు మద్రాసు హైకోర్టు మంగళవారం నిరాకరించింది. హైకోర్టు తాజా నిర్ణయంతో అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వంకు ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

Next Story