- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pakistan: పెహల్గామ్ ఉగ్రదాడిపై తొలిసారి మౌనం వీడిన పాక్ ప్రధాని
పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కాగా.. ఈ పరిణామాలపై తొలిసారిగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మౌనం వీడారు.

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కాగా.. ఈ పరిణామాలపై తొలిసారిగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మౌనం వీడారు. పెహల్గామ్ ఉగ్రదాడిపై తటస్థ, పారదర్శకమైన దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు రెడీగానే ఉన్నామన్నారు. పాకిస్థాన్ (Pakistan) మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న షెహబాజ్ షరీఫ్.. ఉద్రిక్తతల గురించి స్పందించారు. ‘‘పెహల్గామ్ లో జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం. మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎప్పటికీ రాజీ పడేది లేదు. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాం.’’ అని షరీఫ్ తెలిపారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ కామెంట్స్ చేశారు.
సింధూ జలాలపై..
అంతేకాకుండా, సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపైనా ఆయన స్పందించారు. ‘‘భారత్ ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదు. దీనివల్ల యుద్ధవాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం’’ అంటూ భారత్‌పై విర్శలు చేశారు. ఇకపోతే, ఏప్రిల్ 22న పెహల్గాంలో పర్యాటకులపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది చనిపోయారు. కాగా..ఉగ్రవాదులను పట్టుకోవడానికి సైన్యం భారీ వేట ప్రారంభించింది. సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), జమ్ముకశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.






