- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్ ప్రధానికి కొత్త టెన్షన్.. బంగ్లాదేశ్ సీన్ రిపీట్ కానుందా?
పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా యుద్ధం జరిగే పరిస్థితులే

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా యుద్ధం జరిగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో... పాకిస్తాన్ దేశంలో ప్రజలు తిరుగుబాటు చేసేలా కనిపిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇండియా పట్ల పాకిస్తాన్ ప్రధాని వ్యవహరిస్తున్న తీరుపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు... అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.
అత్యంత బలమైన ఇండియాను... తట్టుకోవడం కష్టమేనని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. ఇండియా సమర సన్నాహాల నేపథ్యంలో.. పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం మత పెద్దలు... ఇస్లామాబాద్ లోని కొంతమంది ప్రజలతో కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో దాదాపు ప్రజలందరూ ఇండియాతో యుద్ధానికి తాము మద్దతు ఇవ్వలేమని స్పష్టం చేసినట్టు సమాచారం అందుతుంది. అంతేకాదు, పాకిస్తాన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారట.
అవసరమైతే పాకిస్తాన్ సర్కారుపై తిరుగుబాటు చేసేందుకు కూడా సిద్ధమవుతామని చెబుతున్నారు అక్కడి ప్రజలు. ఒకవేళ నిజంగానే ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే... తమ బతుకులు ఆగమవుతాయని అక్కడి ప్రజలు.. ఇలా తిరుగుబాటు చేసేందుకైనా సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మరి ప్రజల ఆగ్రహం నేపథ్యంలో... పాకిస్తాన్ సర్కార్ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో... ఏకంగా 28 మంది పర్యాటకులను చంపేశారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. దీంతో యుద్ధ వాతావరణం.. రెండు దేశాల మధ్య నెలకొంది. కాగా బంగ్లాలో తిరుగుబాటు చేస్తే, ప్రధాని దేశం వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే.






