ఇరాన్‌తో చర్చలకు పాక్ మధ్యవర్తిత్వం.. ట్రంప్ నిర్ణయంపై ఆసక్తికర చర్చ!

by Kema Shiva Kumar |

అగ్గిమీద గుగ్గిలంలా ఉన్న ఇరాన్‌తో చర్చలకు పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా వాడుకోవాలన్న ట్రంప్ నిర్ణయంపై అంతర్జాతీయంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇరాన్‌తో చర్చలకు పాక్ మధ్యవర్తిత్వం.. ట్రంప్ నిర్ణయంపై ఆసక్తికర చర్చ!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్‌ (Pakistan)ను మధ్యవర్తిగా ఎంచుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం గతంలో అమెరికా అనుసరించిన దౌత్య వ్యూహాలను గుర్తు చేస్తోంది. అయితే, 1970లలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, చైనా (China)తో సంబంధాలను పునరుద్ధరించడానికి పాకిస్థాన్‌ను పావుగా వాడుకున్నారు. ఇప్పుడు ట్రంప్ కూడా అదే తరహాలో ఇరాన్ విషయంలో పాక్ సాయం కోరడం ఆసక్తికరంగా మారింది. ఆనాడు నిక్సన్ చైనాతో సంబంధాల కోసం పాకిస్థాన్‌కు మద్దతునివ్వడం, అనంతరం 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో భారత్-అమెరికా సంబంధాలపై పడిన ప్రభావాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

భారత్ ఆందోళన..

ట్రంప్ తాజా నిర్ణయంతో దక్షిణాసియా (South Asia)లో వ్యూహాత్మక మార్పులకు దారితీస్తుందా.. పాకిస్థాన్ ప్రాధాన్యత పెరిగితే అది భారత్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందా? అనే కోణంలో చర్చ జరుగుతోంది. ఇరాన్‌పై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి పాకిస్థాన్ ప్రధానితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Next Story