- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏ క్షణమైనా దాడి జరగొచ్చు..ఉగ్రదాడిపై పాక్ సంచలన ప్రకటన
పాకిస్థాన్ రక్షణమంత్రి ఆసిఫ్ కవాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపై భారత్ ఏ క్షణమైనా దాడి చేయవచ్చని భావించారు.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ రక్షణమంత్రి ఆసిఫ్ కవాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపై భారత్ ఏ క్షణమైనా దాడి చేయవచ్చని భావించారు. అందుకే తమ సైన్యం కూడా సిద్ధంగా ఉందన్నారు. పాకిస్థాన్ మొత్తం హైఅలర్ట్‌గా ఉందని ఒకవేళ దేశం ఉనికికి ప్రమాదం ఉందని అనిపిస్తే అనుబాంబులు ఉపయోగిస్తామని హెచ్చరించారు. భారత్ వాక్చాతుర్యం పెరుగుతోందని, దాడి జరిగే అవకాశాల గురించి పాకిస్థాన్ సైన్యం ప్రభుత్వానికి వివరించిందని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ నెల 22న పహల్గామ్‌లో టూరిస్టులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే దాడి చేసిన వారిలో ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్థానీలు అని ఇప్పటికే ఇంటిలిజెన్స్ గుర్తించింది. ఉగ్రవాదులు మతం అడిగి మరీ టూరిస్టులను చంపడం సంచలనంగా మారింది. ఉగ్రవాదాన్ని పాక్ పోశిస్తూ ఉండటంతో భారత్ పాక్‌కు గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత సైన్యం యుద్దానికి సిద్దమౌతోంది. సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా యుద్దం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.






