మా జోలికి వస్తే ప్రపంచంలోనే ఎవరూ మిగలరు..పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

by Ajay Maddhiboyina |

పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఖవాజా మాట్లాడుతూ.. భారత్ పాకిస్థాన్ పై దాడికి ప్రయత్నిస్తే ప్రపంచంలోనే ఎవ్వరూ మిగలరని హెచ్చరించారు.

మా జోలికి వస్తే ప్రపంచంలోనే ఎవరూ మిగలరు..పాక్ రక్షణ మంత్రి వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఖవాజా మాట్లాడుతూ.. భారత్ పాకిస్థాన్ పై దాడికి ప్రయత్నిస్తే ప్రపంచంలోనే ఎవ్వరూ మిగలరని హెచ్చరించారు. అంతే కాకుండా ఇండియా పాకిస్థాన్ పరిస్థితిని గాజాలో ఇజ్రాయెల్ సైనిక దాడితో పోల్చాడు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నేతన్యాహు స్నేహితుడు కూడా అదే మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నాడని ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ పై భారత్ దాడికి ప్రయత్నిస్తే, పాకిస్థాన్ ఉనికి ప్రమాదంలో ఉంటే మేం బ్రతుకుతాము లేదంటే ఎవరూ బ్రతకరు అంటూ హెచ్చరించారు.

ఖవాజా తరచూ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేస్తున్నారు. ఇటీవల భారత్ ఏ క్షణమైనా తమపై దాడి చేయవచ్చని అదే జరిగితే ఢిల్లీకి తగిన సమాధానం చెబుతామని అన్నారు. పహల్గామ్ దాడి వెనుక పాక్ ఆర్మీ హస్తం ఉంది అని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో భారత్ పాక్ పై కన్నెర్ర చేసింది. భారత సైతం దేనికైనా రేడీ అంటూ సిద్ధంగా ఉంది. ఓ వైపు పహల్గామ్ ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తూనే మరోవైపు పాక్ ప్రతీకార చర్యలను తిప్పికొడుతోంది. మరోవైపు సైన్యం వీక్ గా ఉన్నా పాక్ రక్షణ మంత్రి మాత్రం మాటల్లో తగ్గడం లేదు. అసలే యుద్ధ వాతావరణం కనిపిస్తుంటే ఆయన రెచ్చొట్టే వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య మరింత హీట్ పెంచుతున్నారు.

Next Story