- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pahalgam Terror attack Behind Pakistan: దాడి పహల్గామ్.. ప్లాన్ రావల్పిండి.. పాక్ కుట్ర బట్టబయలు.. ఏకంగా ఉగ్రవాదులతోనే మీటింగ్!
Pahalgam Terror attack Behind Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ కుట్ర బట్టబయలు అయ్యింది.

దిశ, వెబ్ డెస్క్: Pahalgam Terror attack Behind Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ కుట్ర బట్టబయలు అయ్యింది. దాడికి ముందు రావల్పిండిలో ఉగ్రవాదుల సమావేశం జరిగింది. పాకిస్తాన్ మళ్ళీ డర్టీ గేమ్ ఆడుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన హృదయ విదారక ఉగ్రవాద దాడి దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఈ దాడిలో 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 17 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పుడు ఈ దాడికి సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిఘా సంస్థల నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లోని రావల్పిండి నగరంలో ఉగ్రవాదుల సమావేశమై.. ఈ దాడికి ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. భారత నిఘా సంస్థలకు అందిన సమాచారం ప్రకారం, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల సంయుక్త సమావేశం రావల్పిండిలో జరిగింది. ఈ సమావేశంలో, పహల్గామ్‌లో పర్యాటకులపై లక్ష్యంగా దాడికి ప్లాన్ వేశారు. దాడి చేసిన వారికి సరిహద్దు అవతల నుండి శిక్షణ, ఆయుధాలు అందించినట్లు ఏజెన్సీలు భావిస్తున్నాయి.
స్థానిక ప్రజల సహాయంతో ఈ దాడికి ముందే రెక్కీ నిర్వహించారు. ఎందుకంటే భద్రతా బలగాల కంట్లో పడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఉగ్రవాదులకు తెలుసు. అందుకే ఈ దాడికి స్థానిక ప్రజల సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టెర్రరిస్టులు భారత భద్రత బలగాల యూనిఫాం ధరించడం వల్ల స్థానికులు కూడా వీరిని ఉగ్రవాదులుగా గుర్తించలేకపోయారు. దీంతో వారి ప్లాన్ కు మరింత అనుకూలంగా మారింది. ఘటన జరిగిన రోజు టెర్రరిస్టులు మిలటరీ యూనిఫాంలోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. అంతేకాదు పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి తెచ్చుకున్న అత్యాధునిక ఆయుధాలను కూడా ఉపయోగించారు.
ఓ వైపు పాకిస్తాన్ తనను తాను ప్రపంచానికి "శాంతిని ప్రేమించే" దేశంగా ప్రకటించుకుంటూనే.. మరోవైపు విషం చిమ్ముతోంది. పాక్ గడ్డపై ఉగ్రవాద కుట్రలు బహిరంగంగా జరుగుతున్నాయి. పాకిస్తాన్ కు చెందిన అతిపెద్ద సైనిక స్థావరం అయిన రావల్పిండిలో ఇటువంటి ఉగ్రవాద కుట్ర బయటపడటం పాకిస్తాన్ పాత్ర గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇదంతా జరిగినప్పటికీ, పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ పహల్గామ్ దాడిలో తమ పాత్ర లేదని, భారతదేశం వద్ద ఏదైనా ఆధారాలు ఉంటే దానిని తీసుకురావాలని అంటున్నారు.
Read More..
Pahalgam attack: పీవోకే వెంబడి 42 చోట్ల ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్






