- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakistani Intruder: గుజరాత్ లో చొరబాటుకు యత్నించిన పాకిస్థానీ వ్యక్తి హతం
భారత్‌లోకి చొరబాటుకు యత్నించిన పాకిస్థానీయుడ్ని సరిహద్దు భద్రతా దళాలు (BSF) హతమార్చాయి. శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్‌లోని బనస్కాంత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లోకి చొరబాటుకు యత్నించిన పాకిస్థానీయుడ్ని సరిహద్దు భద్రతా దళాలు (BSF) హతమార్చాయి. శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్‌లోని బనస్కాంత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. భద్రతా బలగాలు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించాయి. “సరిహద్దును దాటి కంచె వైపునకు వస్తున్న ఓ పాకిస్థాన్ వ్యక్తిని గుర్తించాం. వెంటనే అప్రమత్తమై అతడిని నిలువరించేందుకు ప్రయత్నించాం. కానీ, అతడు ముందుకు రావడంతో కాల్పులు జరిపాం. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.” అని భద్రతా బలగాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఇకపోతే, పహెల్గాం ఉగ్రదాడి తర్వాత ఆర్మీ అధికారులు సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి. గతనెలలో పహెల్గాంలో ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ని చేపట్టింది. అందులో భాగంగా పాక్ లోని 9 ఉగ్రస్థావరాలను భద్రతాబలగాలు నేలమట్టం చేశాయి. దీంతో, పాక్ సైన్యం భారత్ పై ఎదురుదాడికి యత్నించింది. వీటిని మన బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది.






