- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు
by Gantepaka Srikanth |
మరోసారి పాకిస్తాన్ వక్రబుద్ధిని చాటుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని సరిహద్దు గ్రామాలపై వైమానిక దాడులకు తెగబడింది. పాక్ దాడుల్లో పలువురు ఆఫ్ఘనిస్తాన్ పౌరులు మృతిచెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మరోసారి పాకిస్తాన్ వక్రబుద్ధిని చాటుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని సరిహద్దు గ్రామాలపై వైమానిక దాడులకు తెగబడింది. పాక్ దాడుల్లో పలువురు ఆఫ్ఘనిస్తాన్ పౌరులు మృతిచెందారు. ఆత్మహుతి దాడులకు ప్రతీకారంగా వైమానిక దాడులు చేసినట్లు పాక్ ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఏడు టెర్రరిస్ట్ క్యాంపులపై దాడులు చేపట్టినట్లు ఆ దేశ సమాచారశాఖ మంత్రి తరూర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. పాకిస్తానీ తాలిబాన్, దాని అనుబంధ సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఐసిస్ అనుబంధ గ్రూప్‌పై సైతం దాడి చేసినట్లు తరూర్ పేర్కొన్నారు. ఇటీవల ఇస్లామాబాద్‌లో మసీద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిని తామే చేసినట్లు ఐసిస్ ప్రకటించుకుంది. ఈ ఘటనలో 31 మంది పాక్ పౌరులు మృతి చెందగా, 161 మంది గాయపడిన విషయం తెలిసిందే.
Next Story






