- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింధూ జలాల కోసం భారత్‌కు పాక్ లేఖలు!
సింధూ జలాల కోసం భారత్‌కు పాక్ లేఖలు రాస్తోంది. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాక్‌లో నీటి సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలోనే ఈ ఒప్పందాన్ని మళ్లీ అమల్లోకి తీసుకురావాలంటూ భారత ప్రభుత్వానికి పాకిస్తాన్ ఇప్పటికి నాలుగు సార్లు లేఖలు రాసిందట. ఏప్రిల్ 22న పహెల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తాజా.. భారత్‌కు లేఖల మీద లేఖలు రాశారట.
ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలనే నిర్ణయాన్ని పునరాలోచించాలని ‘ఆపరేషన్ సిందూర్’కు ముందే ఆయన లేఖ రాశారు. ఆ తర్వాత కూడా మరో మూడుసార్లు ఒప్పందం అమలు చేయాలని అభ్యర్థిస్తూ లేఖలు రాసినట్లు సమాచారం. ఈ లేఖలు అందుకున్న కేంద్ర జలశక్తి మినిస్ట్రీ.. వాటిని విదేశాంగ శాఖకు పంపిందట. అక్కడితో ఆగని పాక్.. 1960లో ఈ ఒప్పందాన్ని కుదిర్చిన మరోసారి ప్రపంచ బ్యాంకును ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ అభ్యర్థించినట్లు తెలుస్తోంది. కానీ అక్కడ కూడా దాయాది దేశానికి భంగపాటు తప్పలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.






