Pakistan Water Crisis: 700 అడుగులు తవ్విన కానరాని నీటి జాడ.. పాకిస్థాన్‌లో అత్యంత దయనీయ పరిస్థితులు!

by Vennela |

Pakistan Water Crisis: పాకిస్థాన్‌(Pakistan)లో నీటి కొరత(water crisis) తీవ్ర స్థాయికి చేరుకుంది.

Pakistan Water Crisis: 700 అడుగులు తవ్విన కానరాని నీటి జాడ.. పాకిస్థాన్‌లో అత్యంత దయనీయ పరిస్థితులు!
X

దిశ,వెబ్‌డెస్క్: Pakistan Water Crisis: పాకిస్థాన్‌(Pakistan)లో నీటి కొరత(water crisis) తీవ్ర స్థాయికి చేరుకుంది. భూగర్భ జలాలు వేగంగా క్షీణిస్తున్నాయి. 1990లలో నీటి మట్టం 100 అడుగులు ఉండేది, కానీ అప్పటి నుంచి 700 అడుగులకు పడిపోయింది.

పాకిస్తాన్ (Pakistan)మరోసారి ఇబ్బందుల్లో పడింది. ఇప్పటికే అప్పులు, ద్రవ్యోల్బణం, ఆకలితో సతమతమవుతున్న పొరుగు దేశం పరిస్థితి ఇప్పుడు మరింత దారుణంగా మారింది. ఇప్పటికే పాకిస్తాన్ వాతావరణ శాఖ ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది . ఈ కాలంలో కరువు కూడా ఎదురవుతుందని చెప్పింది. ఈ హెచ్చరికను అనుసరించి రావల్పిండి నగర నీరు, పారిశుద్ధ్య సంస్థ-WASA నగరవాసుల నీటి అవసరాలకు సంబంధించి ముందు జాగ్రత్త హెచ్చరికను జారీ చేసింది. నగరాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించింది.

పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, రావల్పిండి(Rawalpindi)లోని గారిసన్ నగరంలో నివసించే ప్రజలకు నీటి కొరత కరువు కారణంగా ఏర్పడిందని వాసా మేనేజింగ్ డైరెక్టర్ ముహమ్మద్ సలీం అష్రఫ్ తెలిపారు. దీంతో పాటు, జనాభాలో వేగవంతమైన పెరుగుదల, అనేక ఆర్థిక కార్యకలాపాలు, వనరుల కొరత కూడా దీనికి కారణమవుతున్నాయి.

చాలా కాలంగా వర్షాలు కురవకపోవడంతో ఆనకట్టలు, భూగర్భ జల వనరులు వేగంగా తగ్గిపోయాయని, దీని కారణంగా ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారని వాసా మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. రావల్పిండి నగరానికి ప్రతిరోజూ 68 మిలియన్ గ్యాలన్ల (MGD) నీరు అవసరం కాగా, రావల్-ఖాన్పూర్ ఆనకట్టలు, 490 కి పైగా గొట్టపు బావులు సహా ప్రస్తుత వనరుల ద్వారా 51 MGD నీరు అందించబడుతోంది. VASA అధికారుల ప్రకారం, భూగర్భ జలాలు వేగంగా క్షీణిస్తున్నాయి. 1990లలో నీటి మట్టం 100 అడుగులు ఉండేది, కానీ అప్పటి నుంచి 700 అడుగులకు పడిపోయింది.

Next Story