- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారతే ఆత్మాహుతి దాడి చేయించిందన్న పాక్.. తీవ్రంగా ఖండించిన భారత్
by Phanindra |
తమ ఆర్మీపై జరిగిన ఆత్మాహుతి దాడిని భారతే చేయించిందని పాక్ ఆరోపించింది. వీటిని భారత్ తీవ్రంగా ఖండించింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ ఆర్మీపై జరిగిన ఆత్మాహుతి దాడి భారతే చేయించిందని దాయాది దేశం సంచలన ఆరోపణలు చేసింది. ఉత్తర వాజిరిస్తాన్‌లో జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 13 మంది పాక్ జవాన్లు దుర్మరణం పాలవగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి భారత్ చేయించిందని పాక్ ఆరోపణలు చేయగా.. ఈ వాదనలను భారత్ తీవ్రంగా ఖండించింది.
‘వాజిరిస్తాన్‌లో జరిగిన దాడికి భారత్‌ను బ్లేమ్ చేసేందుకు ప్రయత్నించినట్లు పాక్ ఆర్మీ చేసిన ప్రకటనను మేం చూశాం. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని భారత విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. కాగా, ఈ దాడి తామే చేసినట్లు హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ప్రకటించింది. ఇది తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)తో సంబంధాలు కలిగి ఉన్న సంస్థ కావడం గమనార్హం.
Next Story






