Pakistan : జమ్ముకశ్మీర్‌లోని ఐక్యరాజ్యసమితి ఆస్తులను లక్ష్యంగా చేసుకున్న పాక్‌

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది.

Pakistan : జమ్ముకశ్మీర్‌లోని ఐక్యరాజ్యసమితి ఆస్తులను లక్ష్యంగా చేసుకున్న పాక్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. కాగా.. పాక్ అందుకు ప్రతిస్పందనగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఐక్యరాజ్యసమితి ఆస్తులను లక్ష్యంగా చేసుకుంది. ఈ విషయాన్ని రక్షణ వర్గాలు తెలిపాయి. పాక్ సైన్యం ప్రయోగించిన ఫిరంగి గుండ్లు పూంచ్ లోని ఐక్యరాజ్సమితి ఫీల్డ్ స్టేఏషన్ వైపు దూసుకొచ్చాయి. అయితే, త్రుటిలో తప్పించుకుని గేటు వెలుపల గుండ్ల పడిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ పరిణామంపై ఐక్యరాజ్యసమితి ఇప్పటికీ స్పందించలేదు. అంతకుముందు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటారస్ భారత్- పాక్ ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుదేశాలు సంయమనం పాటించాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ముష్కరుల కాల్పుల్లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో, పాక్‌ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆర్థికపరంగా దెబ్బ తినేవిధంగా చర్యలు చేపట్టింది. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపు దాడులకు పాల్పడింది.

Next Story