- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్థాన్‌ను ‘ఉగ్ర’ దేశంగా ప్రకటించాలి.. కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఫైర్
దాయాది పాకిస్థాన్ (Pakistan)ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ (Kapil Sibal డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దాయాది పాకిస్థాన్ (Pakistan)ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ (Kapil Sibal డిమాండ్ చేశారు. ఇవాళ ఢిల్లీ (Delhi)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manomohan Singh) పదవీ కాలంలో ఇంతలా ఉగ్ర దాడులు జరగకపోయేవని అన్నారు. కేంద్రంలో యూపీఏ సర్కార్ (UPA Government) ఉన్న రోజుల్లో భారత సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం ఉండేదని.. ఉగ్రవాదం కూడా తగ్గుతూ వచ్చిందన్నారు. ప్రస్తుతం దేశానికి నిజమైన సమస్య టెర్రరిజమేనని పేర్కొన్నారు. అందుకే మన విదేశాంగ విధానం పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉందనే వాస్తవంపై ఇప్పటికైనా కేంద్రం దృష్టి సారించాలని సూచించారు. దాయాది పోషిస్తున్న టెర్రరిజంపై ప్రపంచ దేశాలకు అసలు వాస్తవాలను ముందుంచి.. పాకిస్థాన్‌ను ఉగ్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అక్రమ కార్యకలాపాల (UAPA) చట్టంలో కొన్ని సవరణలు తప్పనిసరి అని కపిల్ సిబల్ అన్నారు.






