పాక్ వక్రబుద్ధి.. శ్రీలంకకు ఎక్స్పైరీ సాయం

by Naga Rani Yarlagadda |

దిత్వా తుపాను శ్రీలంకపై పెను ప్రభావం చూపింది. దాదాపు ఆ దేశంలో అనేక ప్రాంతాలు వరదలతో అతలాకుతలమవ్వగా.. వందలాది మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

పాక్ వక్రబుద్ధి.. శ్రీలంకకు ఎక్స్పైరీ సాయం
X

దిశ, వెబ్‌డెస్క్: దిత్వా తుపాను శ్రీలంకపై పెను ప్రభావం చూపింది. దాదాపు ఆ దేశంలో అనేక ప్రాంతాలు వరదలతో అతలాకుతలమవ్వగా.. వందలాది మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో భారత్ సహా అనేక దేశాల శ్రీలంకకు సహాయం అందిస్తున్నాయి. పాక్ కూడా శ్రీలంకకు సహాయం పేరుతో ఆహారం, మందులను పంపించిది. కానీ.. ఇక్కడే ఆ దేశ వక్రబుద్ధి బయటపడింది. ఆపదలో ఉన్న దేశానికి ఆపన్న హస్తం అందించాల్సింది పోయి.. గడువు చెల్లిన వస్తువులను పంపిందన్న వార్తలు గుప్పుమన్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాల వైరల్ అవుతున్నాయి. పాక్ చేసిన ఈ పని పట్ల శ్రీలంక అధికారులు సైతం తీవ్ర అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. శ్రీలంకకు సాయంగా పాక్ పంపిన ఆహారం, మందుల ప్యాకెట్లపై 2024 అక్టోబర్ వరకే ఎక్స్‌పైరీ డేట్ ఉన్నట్లు కనిపించింది. గమనించిన అధికారులు ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

గతంలో 2015లో నేపాల్ లో భూకంపం సంభవించినపుడు కూడా పాకిస్థాన్ సహాయంగా కొన్ని ఆహార పదార్థాలను పంపింది. అప్పుడు కూడా పాక్ పై విమర్శలు వెల్లువెత్తాయి. తాజా ఘటనతో మరోసారి పాక్ వక్రబుద్ధి బయపడిందని తెలుస్తోంది. కాగా.. వరదలతో అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో భారీ సహాయాన్ని అందించింది. 53 టన్నుల అత్యవసర వస్తువులతో పాటు.. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపింది.

Next Story