ప్ర‌మాదంలో పాకిస్తాన్‌..200 శాతం పెరిగిన HIV రోగుల సంఖ్య !

by velandi.Saikiran |   (  Updated:2025-12-02 12:43:21  IST  )

మన ప్రత్యర్థి దేశం పాకిస్తాన్ కు మరో ప్రమాదం వచ్చి పడింది. ఆ దేశంలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.

ప్ర‌మాదంలో పాకిస్తాన్‌..200 శాతం పెరిగిన HIV రోగుల సంఖ్య !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మన ప్రత్యర్థి దేశం పాకిస్తాన్ కు మరో ప్రమాదం వచ్చి పడింది. ఆ దేశంలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( World Health Organization ) వెల్లడించిన నివేదిక ప్రకారం, గత 15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 200% హెచ్ఐవీ కేసులు పెరిగినట్లు తేలింది. ఇందులో దాదాపు 80% మందికి అసలు హెచ్ఐవీ వచ్చిందనే విషయం కూడా తెలియదట. కొందరికి తెలిసినా ఏ స్టేజిలో ఉన్నామనే విషయం కూడా తెలియ‌ద‌ని WHO తమ నివేదికలో స్పష్టం చేసింది.

2010లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుద‌ల‌ చేసిన నివేదిక ప్రకారం, పాకిస్తాన్ దేశంలో కేవలం కొత్తగా 16 వేల మందికి హెచ్ఐవీ సోకింద‌ట‌. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 48 వేలకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ వ్యాప్తంగా హెచ్ఐవీ బాధితుల సంఖ్య మూడు లక్షల 50 వేలకు చేరింది. 2024 డిసెంబర్ వరకే చేసిన సర్వే ప్రకారం ఈ లెక్కలను బయటపెట్టింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇక ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. ఇక ఇందులో 16% మంది మాత్రమే యాంటీ రెట్రో వైరల్ థెరఫీ తీసుకుంటున్నట్లు కూడా WHO పేర్కొంది.

పాకిస్తాన్ లో హెచ్ఐవీ బాధితుల సంఖ్య పెరగడానికి కారణాలు

పాకిస్తాన్ దేశంలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య భారీగా పెరగడానికి కారణం సిరంజీలు. ఇత‌రుల‌కు వాడిన సిరంజీల‌ను మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నారట అక్కడి లోకల్ డాక్టర్లు. దానివల్ల పాకిస్తాన్ లో ఈ హెచ్ఐవీ బాధితుల సంఖ్య పెరుగుతోందని స్పష్టం చేసింది WHO. అలాగే డ్రగ్స్ తీసుకునే వ్యక్తులు, వాడిన సూదులను ఉపయోగించి శరీరంలోకి డ్రగ్స్ ఎక్కించుకుంటున్నారట. దీని వ‌ల్లే బాధితుల సంఖ్య పెరుగుతోంద‌ట‌. అలాగే లైంగిక కారణాల వల్ల కూడా ఈ వ్యాధి విపరీతంగా పెరుగుతుంది. కండోమ్ లు వాడకుండా లైంగిక సంబంధాలు పెట్టుకోవ‌డం వ‌ల్లే, హెచ్ఐవీ కేసులు పెరుగుతున్నాయ‌ట‌. క్లిక్

Next Story