- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakistan: భారత్‌పై ప్రతీకార దాడి.. సైన్యానికి పాక్ ప్రధాని షరీఫ్ అనుమతి!
ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన సైనిక చర్యను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన సైనిక చర్యను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehabaz shareef) ఖండించారు. తమ ఆత్మ రక్షణ కోసం తగిన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు. ఈ మేరకు తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్టు పాక్ పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ అత్యున్నత భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌సీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. బదులు తీర్చుకునే అధికారం సాయుధ దళాలకు ఉందని తెలిపింది. షరీఫ్ అధ్యక్షతన కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారుల సమక్షంలో ఎన్ఎస్‌సీ భేటీ జరిగింది.
ఈ దాడులను చట్టవిరుద్ధమైన చర్యగా ఎన్ఎస్‌సీ అభివర్ణించింది. భారత్ చర్యలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ చర్యలుగా పరిగణించబడుతున్నాయని పేర్కొంది. అంతకుముందు పీఓకేలో చేపట్టిన దాడులపై షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఉగ్రవాద శిబిరాలపై భారత క్షిపణి దాడులను యుద్ధ చర్యగా అభివర్ణించారు. దీనికి తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. దురుద్దేశపూర్వకంగా చేసే దాడులకు ఎప్పటికీ అనుమతించబోమని తెలిపారు. ఈ క్రమంలోనే పాక్ పీఎంఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.






