- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లు.. వైమానిక మార్గాలపై పాక్ ఆంక్షలు!
by Phanindra |
పాక్ సరిహద్దుల వద్ద త్రివిధ దళాల మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లు నిర్వహించేందుకు భారత్ సిద్ధమవుతోంది. దీంతో తమ దేశంలో కీలకమైన వైమానిక మార్గాలపై పాక్ ఆంక్షలు విధించింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: పాక్ సరిహద్దుకు దగ్గరలోని సర్‌క్రీక్ వద్ద భారత త్రివిధ దళాలు మిలిటరీ ఎక్సర్‌సైజ్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను భారత్ విడదుల చేసింది. దీంతో అప్రమత్తమైన పాకిస్తాన్.. పలు మార్గాల్లో ఎయిర్ ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించింది. ఇలా ఎయిర్‌మెన్‌కు నోటీసు ఎందుకు ఇచ్చిందో పాక్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే అక్టోబర్ 28,29 తేదీల్లో మాత్రం సెంట్రల్, దక్షిణ పాక్‌లోని పలు వైమానిక మార్గాల్లో ఎక్కువ విమానాలు వెళ్లకుండా ఆంక్షలు విధించింది. సర్‌క్రీక్ వద్ద ‘త్రిశూల్’ పేరిట భారత త్రివిధ దళాలు భారీ మిలిటరీ ఎక్సర్‌సైజ్ నిర్వహిస్తున్న నేపథ్యంలోనే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అక్టోబర్ 30 నుంచి నవంబరు 10 వరకు ఈ ఎక్సర్‌సైజులు జరగనున్నాయి.
Next Story






