- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్-పాక్ సమస్యలు తీర్చండి.. రష్యాను కోరిన దాయాది దేశం!
by Phanindra |
భారత్-పాక్ సమస్యలు తీర్చండని రష్యాను పాకిస్తాన్ కోరిందట. రష్యానే కాదు ఏ దేశం ఈ సమస్యలు తీరుస్తామన్నా తాము సహకరిస్తామని చెప్పిందట.

X
దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో తమకున్న సమస్యలను పరిష్కరించాలని రష్యాను పాకిస్తాన్ అభ్యర్థించిందట. ఈ విషయాన్ని రష్యాకు చెందిన ప్రముఖ వార్తాసంస్థ వెల్లడించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ప్రత్యేక సలహాదారు తారీఖ్ ఫతేమీ మాట్లాడుతూ.. ‘ఏ క్షణమైనా యుద్ధం మొదలయ్యే పరిస్థితుల్లో ఇరుగుపొరుగు దేశాలు ఉండలేవు. మేం యూఎస్, ఈయూ, రష్యా సహా పలు దేశాలకు అధికారులకు పంపించాం. ఏ దేశమైనా లేదా యూఎన్, మరేదైనా తటస్థ దేశం ఎలాంటి ప్రతిపాదన చేసినా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. సమావేశంలో కూర్చొని సమస్యను వాళ్లు పరిష్కరించేందుకు సహకరిస్తాం’ అని చెప్పినట్లు సమాచారం. కాగా, ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాక్‌కు మద్దతు కూడగట్టడం కోసం ఆ దేశం రెండు దౌత్య బృందాలను తయారు చేసి, వాటిని విదేశాలకు పంపిన సంగతి తెలిసిందే.
Next Story






