Pakisthan: ఆ నిర్ణయాన్ని పున:పరిశీలించండి.. భారత్‌కు పాక్ లేఖ !

by B.Srinivas |

పహెల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్‌తో కొనసాగుతున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

Pakisthan: ఆ నిర్ణయాన్ని పున:పరిశీలించండి.. భారత్‌కు పాక్ లేఖ !
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి (Pahelgam terror attack) అనంతరం పాక్‌తో కొనసాగుతున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని (Indus treaty) భారత్ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే నిర్ణయాన్ని పున:పరిశీలించాలని కోరుతూ పాక్ భారత్‌ను విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పాక్ జలవనరుల మంత్రిత్వ శాఖ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్టు పలు కథనాలు వెల్లడించాయి. నీటి నిలిపివేతతో దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని కాబట్టి ఒప్పందం రద్దు విషయాన్ని పున:పరిశీలించాలని కోరినట్టు తెలిపాయి. అయితే పాక్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడానికి భారత్ నిరాకరించినట్టు సమాచారం. దీనిని ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించలేదు. కాగా, ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. 1960 నాటి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపి వేసింది. అయితే పాక్ ఉగ్రవాదానికి మద్దతివ్వడం ఆపేసే వరకు ఈ ఒప్పందాన్ని పునరుద్దరించలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Next Story