Pakistan: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

by B.Srinivas |   (  Updated:2025-05-26 18:49:14  IST  )

భారత్‌తో శాంతి చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.

Pakistan: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో శాంతి చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehabaz shareef) తెలిపారు. జమ్మూ కశ్మీర్, ఉగ్రవాదం, జల వివాదాలు, వాణిజ్యం సహా అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇరాన్ పర్యటనలో ఉన్న షరీఫ్ టెహ్రాన్‌లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. మేము శాంతిని కోరుకుంటున్నాయని, ప్రాంతీయ శాంతి ప్రయోజనాల దృష్యా ఇండియాతో చర్చలు జరపడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. భారత్ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే నిజంగా వారు శాంతిని కోరుకుంటున్నారని స్పష్టమవుతుందన్నారు. భారత్ తో జరిగిన వివాదంలో పాక్ విజయం సాధించిందని తెలిపారు. కాగా, ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్‌తో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) విషయంలో తప్ప ఏ విషయంలోనూ చర్చలు ఉండబోవని భారత్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో షెహబాజ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Next Story